సీపీఎం జిల్లా పదవ మహాసభలు ఆది, సోమవారాల్లో చిత్తూరులో
నిర్వహించనున్నారు.ఈ మహాసభల్లో జిల్లాకు సంబంధించి 22 అంశాలపై తీర్మానాలు
ఆమోదించనున్నామని తెలిపారు. తొలి రోజు మధ్యాహ్నం 3 గంటలకు రైల్వేస్టేషన్
నుంచి హైరోడ్డు, గాంధీబొమ్మ, ఎంఎస్ ఆర్ సర్కిల్, దర్గా చౌక్‌ల మీదుగా
కణ్ణన్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ర్యాలీ అనంతరం
కళాశాల మైదానంలో బహిరంగ సభలో రాష్ట్ర కార్యదర్శి రాఘవులు ప్రసంగిస్తారన్నా
రు. రెండవ రోజుప్రతినిధుల సమావేశంలో పార్టీ నిర్ణయాలను, తీర్మానాలను
ఆమోదిస్తామని తెలిపారు. జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా
ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో సొంత నియోజకవర్గం పీలేరుకు మాత్రమే
పరిమితవుతున్నారని కుమార్‌రెడ్డి ధ్వజ మెత్తారు. పీలేరు పట్టణంలో తన సొంత
స్థలంలో రూ. 60లక్షల పంచాయతీ నిధులతో క్యాంపు కార్యాలయాన్ని నిర్మించడాన్ని
తీవ్రంగా విమర్శించారు. ప్రజల సొమ్ముతో భవనం నిర్మించిన స్థలాన్ని
పంచాయతీకి అప్పగిస్తారా అని సీఎంను ప్రశ్నించారు. జిల్లాలో వ్యవసాయరంగానికి
మేలు చేసే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తి
గా విఫలమైందన్నారు. హరికృష్ణ మాట్లాడుతూ టీటీడీ నిధులను జిల్లా
అభివృద్ధికి వినియోగించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఉద్యోగాల్లో
జిల్లావాసులకు కొంత వాటా, జిల్లాలోని జూనియర్, డిగ్రీ కళాశాలల నిర్వహణ,
తాగునీరు, వైద్యానికి టీటీడీ నిధులు కేటాయించాలని తీర్మానాలు చేయనున్నామని
చెప్పారు. జిల్లాలోని 5.25లక్షల సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికులకు
ఉద్యోగభద్రత కనీస వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు.పార్టీ రాష్ట్ర
కార్యదర్శి బీవీ.రాఘవులు, కార్యదర్శివర్గ సభ్యులు కృష్ణయ్య, సోమయ్య ముఖ్య
అతిథులుగా హాజరుకానున్నారు. ప్రజాపోరాటాలు, భవిష్యత్ కార్యాచరణపై
సమీక్షించనున్నట్టు పార్టీ జిల్లా కార్యదర్శి కె.కుమార్‌రెడ్డి, సీఐటీయూ
కార్యదర్శి హరికృష్ణ, చిత్తూరు డివిజన్ కార్యదర్శి పి.చైతన్య వెల్లడించారు.
పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వారు శుక్రవా రం విలేకరుల సమావేశంలో
మాట్లాడా రు.
No comments:
Post a Comment