
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ
ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఏర్పాటు చేసిన సమావేశానికి 22 మంది
శానససభ్యులు వచ్చారు. గుంటూరు ఓదార్పు యాత్రను విరమించుకుని వైయస్ జగన్
శుక్రవారం సాయంత్రం హుటాహుటిన హైదరాబాదు వచ్చారు. శనివారం ఉదయం తన
వర్గానికి చెందిన శానససభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ప్రారంభంలో
9 మందే ఉన్నప్పటికీ ఆ సంఖ్య 21కి చేరుకుంది. పిల్లి సుభాష్
చంద్రబోస్, సుచరిత, శోభా నాగిరెడ్డి, మేకపాటి చంద్రశేఖర రెడ్డి, సత్యవతి,
బాబూరావు, పూతలపట్టు రవి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు సమావేశానికి
వచ్చారు. సమావేశానికి వచ్చిన వారిలో బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదినారాయణ
రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి,
శ్రీకాంత్ రెడ్డి, ధర్నాన కృష్ణప్రసాద్, చెన్నకేశవ రెడ్డి, కాపు రామచంద్రా
రెడ్డి కూడా ఉన్నారు. ప్రసాద రాజు, బాలరాజు, శివప్రసాద్ రెడ్డి, బాలనాగి
రెడ్డి కూడా సమావేశానికి హాజరయ్యారు. అవిశ్వాస తీర్మానానికి తాము
మద్దతిస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, ఆయన వర్గానికి చెందిన
కొంత మంది శాసనసభ్యులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైయస్ రాజశేఖర
రెడ్డిని తిడుతూ పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వడం సరి కాదనే వాదనను
వారు ముందుకు తెస్తున్నారు. ధర్మాన కృష్ణ ప్రసాద్ మాటలను బట్టి ఆ విషయాన్ని
అర్థం చేసుకోవచ్చు.
No comments:
Post a Comment