Monday, 19 December 2011

ఆస్ట్రేలియాలో చలికాలం పోయి వేసవి...మహేంద్ర సింగ్ ధోనీ

టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ కూల్‌గానే కాదు, చ మత్కారాలతో నవ్వులు పూయించడంలోనూ దిట్టే! ఇక్కడి భారత హైకమిషన్... టీమిండియా గౌరవార్థం శనివారం ఇచ్చిన విందులో ధోనీ తన చలోక్తులతో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చాడు. భారత్-ఆసీస్ సిరీస్ అంటే వాణిజ్య ప్రకటనలూ పదునుదేలుతాయంటూ, 'ఓ వాణిజ్య ప్రకటన చూశా. అందులో, తాజా సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో చలికాలం పోయి వేసవి వచ్చేసింది. ఇక వేడి తీవ్రత మరింత పెరగనున్నదని చెప్పారు. ఈ విషయాన్ని నేను చాలా సీరియస్‌గా నమ్మాను, అందుకే, ఒక్క లెదర్ జాకెట్ కూడా వెంట తెచ్చుకోలేదు. మరిక్కడేమో చల్లగా ఉందాయె' అనడంతో పార్టీకొచ్చిన భారత ప్రవాసులందరూ ఒక్కపెట్టున నవ్వుల్లో మునిగిపోయారు. ఇక మంకీగేట్ వివాదంలో భాగస్వాములు హర్భజన్, సైమండ్స్‌లు ఈసారి జట్లలో లేకపోవడంతో కుర్రాళ్లు ఆ బాధ్యత తీసుకుంటారని ధోనీ చెప్పుకొచ్చాడు. 'సిరీస్‌కు ముందు అందరూ కంగారూలను స్లెడ్జింగ్‌కు భారత్ అడ్డుకట్ట వేయలేదన్నారు. కానీ, మేమూ మాటకుమాట జవాబివ్వగలం. భజ్జీ, సైమో లేకపోతేనేం కుర్రాళ్లు ఆ లోటును భర్తీ చేస్తార్లే' అంటూ వ్యాఖ్యానించాడు.

No comments:

Post a Comment