ప్రముఖ సినీ నిర్మాత, రచయిత ఎంఎస్.రెడ్డి(మల్లెమాల) ‘ఇది నా కథ’ పేరుతో తన
ఆత్మకథ రాసి పుస్తక రూపంలో ఆ మధ్య విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ
పుస్తకంలో తన సినీ జీవితంతో పాటు పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి,
జూనియర్ ఎన్టీఆర్, గుణశేఖర్ లాంటి వారిపై విమర్శలు చేస్తూ...సాధారణ జనాలకు
వారి మనస్తత్వం గురించి తెలియని విషయాలను బట్టబయలు చేశారు. ఒక రకంగా
చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమలో చీకటి కోణాల్ని కూడా తన పుస్తకంలో
ఆవిష్కరించారు మల్లెమాల. ఈ పుస్తకంపై పరిశ్రమలో రగడ రేగిన నేపథ్యంలో
ఎంఎస్.రెడ్డి తనయుడు శ్యాంప్రసాద్ రెడ్డి వెంటనే ఆ
పుస్తకాలన్నింటినీ...మార్కెట్ నుంచి వెనక్కి తెప్పించారు. ఇటీవల
ఎంఎస్.రెడ్డి మరణించిన నేపథ్యంలో....ఈ పుస్తకం మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఆ
పుస్తకాన్ని దక్కించుకోడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నా...ఎక్కడా దొరకడం
లేదు. ఇదే అదునుగా తొలుత ఆ పుస్తకాన్ని దక్కించుకున్న కొందరు వ్యక్తలు,
ఆపుస్తకాన్ని మరిన్ని కాపీలు తయారు చేయించి రూ. 10వేల చొప్పున గుట్టు
చప్పుడు కాకుండా బ్లాక్లో అమ్ముతున్నట్లు ఫిల్మ్ నగర్ లో తాజాగా
వినిపిస్తున్న సమాచారం.
పెట్టుబడిదారీ సమాజం లో ప్రతీదీ సరుకుగా మారుతుందని అని కారల్ మార్క్స్ ఏనాడో మన బ్రహ్మం గారు కాలజ్నానం లో చెప్పినట్టు చెప్పారు. ఎం.ఎస్.రెడ్డి గారి పుస్తకాన్ని ఇలా ఆపడం ఎంత మాత్రమూ సమంజసం కాదు. మొహమాటం లేకుండా అభిప్రాయం చెప్పే వాళ్ళలో రెడ్డి గారు ఒకరు. శ్యాంప్రసాద్ రెడ్డి ధైర్యవంతుడనుకున్నము గానీ ఇంత పిరికి చర్యకు పాల్పడతారనుకోలేదు. ఇప్పటికైనా ఆ పుస్తకాన్ని పబ్లిష్ చేయ్డం మంచిది. నిజం నిప్పులాంటిది. అది దాస్తే దాగేది కాదు. పైగా ఆ పుస్తకం లో వ్యాఖ్యలకు " కాలిదాసు కవిత్వం కొంత - జ్నానదాసు పైత్యం కొంత " అన్నట్లు మనోళ్ళ సొంత వ్యాఖ్యలు చిలువలు పలువలుగా రేగే అవకాశం వున్నందున ఈ పుస్తకాన్ని వెంటనే పబ్లిష్ చేయించేందుకు శ్యాంప్రసదరెడ్డి గారు పూనుకోవాలి.
ReplyDelete