Monday, 19 December 2011

సచిన్ టెండూల్కర్ భారతరత్న వద్దు..మాజీ కెప్టెన్ అజరుద్దీన్

భారత క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై తనకు గల వ్యతిరేకతను మరోసారి బయటపెట్టారు పార్లమెంటు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహ్మద్ అజరుద్దీన్. సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న ఇవ్వడానికి అనువుగా నిబంధనలను సవరించిన నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన చేశారు. హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్‌కు ఇవ్వకుండా సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న ఇవ్వకూడదని ఆయన శనివారం అన్నారు. సచిన్ టెండూల్కర్ కన్నా ముందు ధ్యాన్‌చంద్‌కు భారతరత్న రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. సచిన్ టెండూల్కర్, ధ్యాన్‌చంద్‌లను భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు అర్హులను చేస్తూ నిబంధలను సవరించారు. వారిద్దరికి ఆ అవార్డు లభించడానికి వీలు కల్పించే ఆ సవరణలను దేశం యావత్తూ స్వాగతించింది. సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న రావాలని దేశం మొత్తం ఆశిస్తోంది. ఈ సమయంలో అజరుద్దీన్ అందుకు విరుద్ధంగా ప్రతిస్పందించారు

No comments:

Post a Comment