పాతికేళ్ల తర్వాత సత్యసాయి ప్రశాంతి నిలయంలో విద్యుత్ కోత
ప్రశాంతి నిలయంలో పాతికేళ్ళుగా అమలుకాని విద్యుత్ కోతను ఆదివారం పట్టణ
ప్రజలు చవిచూశారు. సత్యసాయి భౌతికంగా వున్న రోజుల్లో ప్రశాంతి ని లయంలో
విద్యుత్ అంతరాయం, కోత అనే రెండు పదాలు చవిచూసిన దా ఖలాలు లేవు. రాష్ట్ర
వ్యాప్తంగా విద్యు త్ కోత అమలుచేసినప్పటికీ ప్రశాంతి నిలయం ఫీడర్‌కు 24
గంటల పాటు విద్యుత్ సరఫరా అయ్యేది. అయితే సత్యసాయి శివైక్యానంతరం
పరిస్థితులు మారిపోయాయి. ప్రప్రథమంగా 8 గంటల పాటు పాతికేళ్ళ విరామానంతరం
విద్యుత్ కోతను విధించడం పట్టణ ప్రజలను, వ్యాపార వర్గాలను ఇబ్బందులకు
గురిచేసింది. ఆదివారం నుండి అమలులోకి వచ్చిన విద్యుత్ కోతల మేరకు ఉదయం 6
నుండి 10 దాకా, తిరిగి మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల దాకా విద్యుత్
కోత అమలులో వుంటుంది. పగటివేళ రోజు మొత్తం కలిపి 4 గంటలు మా త్రమే విద్యుత్
సరఫరా అవుతుంది. దీంతో పుట్టపర్తిని సందర్శించే పర్యాటకులు విద్యుత్ కోత
మూలంగా వసతి గృహాల్లో వేడి నీరు దొరకని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. బహుళ
అంతస్థుల్లో నివసిస్తున్న వయసు పైబడిన భక్తులు విద్యుత్ కోతతో లిఫ్ట్‌లు
పనిచేయకపోవడంతో సమాధి దర్శనానికి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఇదిలా
వుండగా పట్టణంలో వ్యా పార సముదాయాలు విద్యుత్ కోతతో స్తంభించాయి. ఇదిలా
వుండగా ట్రాన్స్ కో అధికారులు సైతం వరి పంటను సాగు చేయవద్దని కేవలం ఆరుతడి
పంటలు మాత్రమే సాగు చేయాలని కోరడం చూస్తే రానున్న రోజుల్లో విద్యుత్ కోత
ప్రభావం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శీతాకాలంలోనే పరిస్థితి ఈ
విధంగా వుంటే వేసవికాలంలో విద్యుత్ సరఫరా వుంటుం దా లేదా అనే ప్రశ్నలు
వినిపిస్తున్నా యి. ఏది ఏమైనా పుట్టపర్తిలో అంతర్జాతీయ పర్యాటకుల
తాకిడితోపాటు సూపర్ స్పెషాలిటి హాస్పిటల్లో వైద్య సేవలు కొనసాగుతున్న
దృష్ట్యా రోగులకు అసౌకర్యం కలిగే పరిస్థితి నెలకొంటుంది. కావున ట్రాన్స్‌కో
ఉన్నతాధికారులు పుట్టపర్తిని దృష్టిలో వుంచుకొని విద్యుత్ కోతను
అమలుచేయకుండా ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని స్థానికులు కోరుతున్నారు.
రాజకీయ నాయకులు తమ స్వర్ధ ప్రయోజనాల కోసం అల్లకల్లోలం చెసి రాష్ట్రాన్ని ఈ దుస్తితికి తెచ్చారు. కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో అసలు పరిపాలనే లేదు...ప్లాన్నింగు లేదు.
ReplyDeleteఇప్పటి ముఖ్యమంత్రి కూడా ఏమాత్రం దూర దృష్టిలేని విధంగా ఎవరూ అడగని పనికి రాని పధకాలను పెట్టి రాష్ట్రాన్ని మరింత దిగజార్చే దానికి తనవంతు తను కృషి చేస్తున్నడు. "రాజకీయ నాయకులారా పరిపాలన అంటే ప్రజలకి రోజువారి తిండి పెట్టడం కాదు; ప్రజలు తమబ్రతుకు తాము బ్రతికే వాతావరణం కల్పించటం". అలా వుండాలంటే ఈ రోజులలో కరెంటు చాలా ముఖ్యమైన వస్తువు.. దాని గురించి ముందాలోచన చేసుకోకపోతే మీరు ఎన్ని {ప్రజలు అడగని పనికిరాని} పధకాలు పెట్టినా ప్రజలకేమీ ప్రయోజనం ఉండదు. మీకు తప్ప.......