Monday, 19 December 2011

హంతకులు దొరికితే అక్కడే కాల్చేయండి...కర్నూలు జిల్లా ఎస్పీ

కర్నూలు జిల్లాలో గత కొద్ది రోజులుగా పెద్ద యెత్తున హత్యలు జరుగుతున్నాయి. నెలకు పది నుంచి 15 హత్యలు జరుగుతున్నట్లు సమాచారం. సోమవారం కూడా ఓ హత్య జరిగింది. పోలీసులంటే భయం లేకుండా పోయిందని ఎస్పీ అభిప్రాయపడుతున్నారు. గత 15 రోజుల వ్యవధిలో ఆరు హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. రౌడీ షీటర్లు, పాతకక్షలు పెట్టుకున్నవారు ఇష్టారాజ్యంగా హత్యలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. కర్నూలు జిల్లాలో హత్యలు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) సోమవారం పోలీసులకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. హత్యా స్థలంలో నిందితులు కనిపిస్తే కాల్చేయాలని ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నిందితులు వాహనంలో పారిపోతుంటే వాహనం టైర్లను పేల్చేయాలని ఆయన ఆదేశించారు. హత్య కేసుల్లో అలా చేస్తే విచారణ ఉండదని ఆయన చెప్పారు. నిందితులకు నేరుగా శిక్ష వేయాలని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలీసూ ఆయుధాన్ని దగ్గర ఉంచుకోవాలని, సాధారణ పౌరులకు ఇబ్బంది కలగకూడదని ఆయన అన్నారు.

No comments:

Post a Comment