మదనపల్లెలో జరిగిన అండ ర్-14 రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంటు లో కడప, అనంతపురం జట్లు విజేత లుగా నిలిచాయి. రాష్ట్ర స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్యర్వంలో మదనపల్లె గోల్డెన్‌వ్యాలీ స్కూల్ మైదానంలో మూడు రోజులుగా జరుగుతున్న ఈ టోర్నీ ఫైనల్స్ ఆదివారం జరిగాయి. బాలుర విభాగంలో కడప జట్టు, బాలికల విభాగంలో అనంతపురం జట్టు విజయం సాధించాయి. తొలుత బాలుర విభాగంలో చిత్తూరు-అనంత పురం, కడప-కృష్ణా, హైదరాబాద్-వై జాగ్, మహబూబ్‌నగర్- గుంటూరు జట్లు క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడ్డాయి. అనంతపురం, కడప, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి.సెమీఫైనల్స్‌లో అనంత పురం జట్టు మహబూబ్‌నగర్‌పై 4-1 గోల్స్ తేడాతోనూ, కడప జట్టు హైదరా బాద్‌పై 5-1 గోల్స్ తేడాతోనూ విజ యం సాధించాయి. ఫైనల్ మ్యాచ్‌లో తలపడిన కడప, అనంతపురం జట్లు ఆట సమయం పూర్తయ్యేసరికి 1-1 స్కోరుతో సమవుజ్జీలుగా నిలబడ్డాయి. దీంతో ఇరు జట్లు సడెన్‌డెత్ గోల్స్‌లో పోటీపడ్డాయి.ఇందులో కడప జట్టు 5 గోల్స్ చేయగా, అనంతపురం జట్టు నాలుగు గోల్స్ మాత్రమే చేసి అపజ యం పాలైంది.బాలికల విభాగంలో క్వార్టర్‌ఫైనల్ ్సలో వైజాగ్ జట్టుపై కడప జట్టు, ప్రకాశం జట్టుపై అనంతపురం జట్టు, తూర్పుగోదావరిపై చిత్తూరు జట్టు, వరంగల్‌పై కర్నూలు జట్టు విజయం సాధించి సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. సెమీఫైనల్స్‌లో చిత్తూ రుపై అనంతపురం జట్టు, కర్నూలుపై కడప జట్టు విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకున్నాయి.ఫైనల్స్‌లో కడప జట్టుపై అనంతపురం జట్టు 2-0గోల్స్ తేడాతో అవలీలగా విజయం సాధిం చింది. విజేతలకు గోల్డెన్‌వ్యాలీ కర స్పాండెంట్ రమణారెడ్డి, ఆదిత్య కళా శాల ప్రిన్సిపాల్ రామలింగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శకుంతల బహు మతులను ప్రదానం చేశారు.జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి రామచంద్ర, వాల్మీకిపురం సీఐ చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment