
శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసంలో 3వ సోమవారం ముందుగానే భక్తుల సందడి
కనపడింది. శెలవు దినాలు రావడంతో శ్రీశైలం భక్తులతో కిక్కిరిసింది. ముందుగా
భక్తుల రద్దీని గమనించిన అధికారులు ఆలయ వేళలు మార్పు చేశారు. ఉదయం 2.30
గంటలకే మంగళవాయిద్యాలు, 3 గంటలకు సుప్రభాతసేవ, 4 గంటలకు మహామంగళహారతి, 4.30
దర్శన ఆర్జిత సేవలను ప్రారంభించారు. సాయంత్రం ఆలయాన్ని మూసివేసి 6 గంటల
నుంచి భక్తులకు దర్శనం కల్పించారు. వచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను
దర్శించుకునేందుకు క్యూలైన్లలో నీటి వసతి, భద్రత ఏర్పాటు చేశారు. 1.50
లక్షల మంది భక్తులు స్వామి వార్లను దర్శించకున్నట్లు తెలిపారు. భక్తులు
ఉదయం నుంచి 436 సామూహిక అభిషేకాలు నిర్వహించుకున్నట్లు ఆలయ అధికారులు
తెలిపారు. అలాగే కార్తీక దీపారాధన చేసుకునే భక్తులు నాగులకట్టవద్ద
పోటీపడ్డారు. కట్ట సముదాయంలో, చుట్టు ప్రదేశాల్లో కల్లాపుచల్లి ముగ్గులు
వేసి దీపారాధనలు చేశారు. పూజారులను ఏర్పాటుచేసుకొని 10 లక్షల ఒత్తుల
ద్వీపాలను వెలిగించారు. వసతి గృహాలన్ని కిక్కిరిసి పోయాయి. ముందుగా గదులను
రిజర్వు చేసుకొని వచ్చే భక్తులకు వసతి గృహం లేకుండా ఇబ్బందులు పడుతున్నారు.
కార్తీక మాసంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్ర ఎక్సైజ్
శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆదివారం సాయంత్రం స్వామి, అమ్మవార్లను
దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, రెవెన్యూ సిబ్బంది ఘనంగా స్వాగతం
పలికారు. వీరికి ఆలయ తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.
No comments:
Post a Comment