
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల పుణ్యక్షేత్రంలో ప్లాసిక్ నివారించేందుకు
టిటిడి కృతనిశ్చయంతో వుందని, తిరుపతిలో కూడా ప్లాస్టిక్ నిషేధం
విధించేందుకు తగు చర్యలు తీసుకోనున్నట్లు మున్సిపల్ రీజనల్ జాయింట్
డైరెక్టర్ ఖాదర్‌సాహెబ్ తెలిపారు. శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చిన
ఆయన తిరుపతి మున్సిపల్ కార్యాలయంలలో విలేఖరుల సమావేశం ఏర్పాటు
చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థ తాను వెళ్లిన
సందర్భంగా తిరుమలలో టిటిడి అధికారులు ప్లాస్టిక్ నిషేధం, అన్నం
వృథాకాకుండా, వేస్టు మెటీరియల్ రీసైక్లింగ్ తదితర అంశాలపై చర్చించారన్నారు.
తిరుమలకు ప్లాస్టిక్ వస్తువులను పంపకుండా తిరుపతిలోనే కట్టడి చేస్తే
బాగుంటుందని తాము భావిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే నగరంలో ప్లాస్టిక్
విక్రయాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ప్రసాద్‌ను
అదేశించినట్లు చెప్పారు. అలాగే పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి
పెట్టాలని అధికారులను అదేశించినట్లు చెప్పారు. ఇంటింటా చెత్త సేకరణ
కార్యక్రమాన్ని తిరుపతిలో ప్రయోగాత్మకంగా ఒక వార్డు రెసిడెన్సియల్
ఏరియాలోనూ, మరో వాణిజ్య వార్డును ఎంపిక చేసి విజయవంతంగా చెత్త సేకరణ
చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 31వతేది నాటికి తిరుపతిలోని ప్రతి ఇంటి
నుండి మున్సిపల్ సిబ్బందే స్వయంగా చెత్తను సేకరించే కార్యక్రమాన్ని
చేపడుతారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ ఇందిరాప్రియదర్శని కూరగాయల
మార్కెట్‌ను ఆకస్మింగా తనిఖీ చేశారు. మార్కెట్‌లో రోడ్డుపై చెత్తను
పడేవేయడాన్ని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవ్వరు దుకాణం
ముందుంటే వారి చేతనే చెత్తను తొలగింపజేశారు. మరోమారు చెత్త వేస్తే 1000
రూపాయలు ఒక్కొక్కరికి జరిమానా వేస్తామని హెచ్చరించారు. అనంతరం మార్కెట్‌లో
కొన్ని రోజులుగా దుర్గంధం వెదజల్లుతూ వున్న చెత్తను చూసి ఆయన అధికారులపై
ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తను తరలించేందుకు వాహనాలున్నా, ఇంత స్థాయిలో
ఖర్చులు పెడుతున్నా ఇంత అధ్వాన్నంగా వుండటం ఏమిటి అంటూ అధికారులను జెడి
ప్రశ్నించారు. అనంతరం మార్కెట్ కాంట్రాక్టర్ నరసింహారెడ్డిని పిలిచి
మార్కెట్‌లోని దుకాణదారులతో శ్రమదానం చేసి మార్కెట్‌ను శుభ్రంగా
వుంచుకోవాలని అదేశించారు. భవిష్యత్‌లో మళ్లీ తాను వచ్చినప్పుడు మార్కెట్
ఎంతో శుభ్రంగా వుండాలని అధికారులకు, మార్కెట్ దుకాణదారులకు,
కాంట్రాక్టర్‌కు అదేశించారు.
No comments:
Post a Comment