యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన సత్యసాయి భక్తుడు ఐశాక్ టైగ్రేట్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 23వ తేదీలోగా బాబా తనతో చర్చించిన విషయాలను బయటకు వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఐశాక్ తెల్ల కాగితాలపై బాబా స్వయంగా గీసిన స్కెచ్ లను బయటపెట్టారు. అనేకమార్లు ప్రత్యేకంగా సంభాషించే అవకాశం సత్యసాయి తనకు కల్పించారని, ఈ క్రమంలో సత్యసాయి సంస్థల భవిష్యత్ ప్రణాళిక అంశం చర్చకు వచ్చిందని తెలిపారు. చాలాకాలంగా అజ్ఞాతంలో ఉన్న ఐశాక్ ఈమెయిల్ ద్వారా ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు.వెయ్యికాళ్ల మండపం తరహాలో ప్రశాంతి నిలయంలో ఆలయాలు నిర్మించాలని తనతో బాబా చెప్పారన్నారు. అటువంటి స్కెచ్ లను బాబా వేసి చూపించారన్నారు. ప్రపంచంలోనే అత్యంత సుందరంగా ప్రశాంతి నిలయం ఉండాలని, అత్యాధునిక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసి తన సందేశాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని బాబా తనతో చెప్పినట్లు ఐశాక్ టైగ్రేట్ వెల్లడించారు
No comments:
Post a Comment