రాష్ట్రంలో వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చే పేదల నుంచి లంచాల రూపంలో అధికారులు ఏటా రూ.2000 కోట్లు కాజేస్తున్నారంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా మనూర్ మండలం బోరంచలో శుక్రవారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. "కుల, ఆదాయ, నివాస, పహాణీ, చౌపస్లా తదితర సర్టిఫికెట్ల కోసం ఏటా 2 కోట్లమంది ప్రభుత్వ కార్యాలయాలకు వెళుతున్నారు. ఆ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారు. 'మీ సేవ' కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దీనిని చిత్తూరు జిల్లాలో ప్రారంభించాం.వచ్చే మార్చి 31వ తేదీనాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఏ సర్టిఫికెట్‌కు ఎంత ఫీజు ఉంటుందని తెలిపే బోర్డు ఆ కేంద్రాల్లోనే ఉంటుంది. ఆ మేరకు డబ్బు చెల్లించిన 15 నిమిషాల్లోనే సర్టిఫికెట్లు ఇస్తారు. ప్రజలకు అవసరమైన 50 రకాల సర్టిఫికెట్లను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
No comments:
Post a Comment