శివరాత్రికి శ్రీశైలం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృత
ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాంశంకర్ నాయక్ తెలిపారు. ఫిబ్రవరి 13
నుంచి 23 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకై
దేవస్థానం కార్యనిర్వాహక భవనంలో సమీక్ష సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్
రాంశంకర్‌నాయక్, ఎస్పీ శివప్రసాద్, ఇ ఓ హనుమంతరావు, దేవస్థానం ధర్మకర్తల
మండలి చైర్మన్ ఇమిడిశెట్టి కోటేశ్వరరావు, పాలక మండలి సభ్యుల అధ్యక్షతన
అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ
సందర్భంగా వారు మాట్లాడుతూ శివరాత్రికి సంబంధించిన ఏర్పాట్ల గురించి, వసవి
విభాగం, పారిశుద్యం, ట్రాఫిక్, క్యూలైన్లు, వాలెంటీర్లు తదితర ఏర్పాట్ల
గురించి చర్చించారు. తాగునీటి సమస్యలు రాకుండా పంపింగ్ ద్వారా, ట్యాంకుల
ద్వారా ఏర్పాటు చేయాలన్నారు. 9 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవలు
అందిస్తామన్నారు. పారిశుద్ధ్యం కొరకు 350 మందిని, 650 స్వీపర్లు, 6
ట్రాక్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వసతి నిమిత్తం 1300 బస్సులను
ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఘాట్‌రోడ్ల వద్ద స్వీడ్ బ్రేకర్ల ఏర్పాటు
చేస్తామన్నారు. ఈప్రాంతాల్లో పల్లె వెలుగు బస్సులకు బదులుగా కొత్త బస్సులు
ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రించాలని ఆర్ ఎంలను కలెక్టర్ ఆదేశించారు.
అగ్నిమాపక సిబ్బందిని ఏర్పాటు చేసి పాతాళగంగ సమీపంలో గజ ఈతగాళ్ళను ఏర్పాటు
చేస్తున్నట్లు తెలిపారు. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో 95 సాంస్కృతిక
కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జి తెలుగులో వచ్చే
కార్యక్రమాలను కూడా ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. 1800 మంది భద్రతా
సిబ్బందిని, నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చివరి రోజులైన
19, 20, 21 తేదీల్లో మద్యపానాన్ని నిషేదిస్తున్నట్లు తెలిపారు. ఏదేమైనా
భక్తులకు దర్శనాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సహకరించి సేవ చేయాలని వారు
ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌కో ఎస్ ఇలు, ఆర్టీసి ఆర్‌యంలు,
ఆర్డీవో వెంకటమురళి, ఫారెస్టు, పారిశుద్య తదితర అధికారులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment