ప్రముఖ గాయని ఎస్.జానకి గాయపడ్డారు. తలకు గాయం కావడంతో.. ఆమెను తిరుపతి
స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. తిరుపతిలోని హోటల్ భీమాస్ బాత్‌రూమ్‌లో
ఆమె జారిపడ్డారు. ఈ ఉదయం ఈ ఘటన జరిగింది. స్విమ్స్‌లో ఆమెకు MRI స్కాన్
తీశారు. గాయం కారణంగా మెదడులో రక్తం గడ్డకట్టిందని సమాచారం.
గాయకుడు బాలకృష్ణ ప్రసాద్ నిర్వహిస్తున్న అన్నమయ్య సంకీర్తనా మహాయజ్ఞంలో
పాల్గొనేందుకు జానకి తిరుపతి వచ్చారు.
నగరంలో ఐదు రోజులుగా జరుగుతున్న అన్నమయ్య సంకీర్తన యజ్ఞంలో జానకి
పాల్గొంటున్నారు. నిర్వహకులు జానకికి ఓ ప్రైవేటు హోటల్‌లో వసతి కల్పించారు.
కాగా ఈ ఉదయం బాత్‌రూంలో కాలు జారి కిందపడిపోవడంతో తలకు గాయమయింది. ఈ
సందర్భంగా మరో గాయకుడు బాలకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ (మా పిన్ని) జానకీ
త్వరగా కోలుకుంటుందని అన్నారు. ఈ విషయంలో ఆందోళన చెందనవసరం లేదని
అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే ఈరోజు సాయంత్రం జరగాల్సిన
సంకీర్తనా యజ్ఞం యథావిధిగా జరుగుతుందని ఆయన తెలిపారు. ఐదురోజులుగా అన్నమయ్య సంకీర్తనా యజ్ఞంలో పాల్గొన్న జానకికి ఈ ఉదయం ప్రమాదం
జరిగిందని తెలిసి, ఆస్పత్రికి తరలివస్తున్న సినీ ప్రముఖులు, కుటుంబసభ్యులు
అభిమానులు ప్రజలు ఆవేదన చెందుతున్నారు. భక్తులు, అభిమానులు త్వరగా ఆమె
కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. Tuesday, 7 February 2012
సినీ గాయని జానకి తలకు గాయం

కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment