Wednesday, 18 January 2012

మంత్రివర్గ విస్తరణ ఐదుగురి కి గ్రీన్ సిగ్నల్

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గ విస్తరణపై బుధవారం ఢిల్లీలో పెద్దలతో భేటీ అవుతూ బిజీ బిజీగా గడిపారు. మంత్రివర్గ ప్రక్షాళనకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, కొత్తగా ఐదుగురిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని, తెలంగాణకు మూడు, పీఆర్పీకి రెండు పదవులు దక్కనున్నట్లు వార్తలు వచ్చాయి. చివరికి కేబినెట్ విస్తరణ ఇద్దరితోనే జరుగుతుందని, అదికూడా ప్రజారాజ్యం పార్టీకి పరిమితం అయినట్లు తెలుస్తోంది. భారీ ఆశలతో ఢిల్లీకి వెళ్లిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అంచనాలు తారుమారైనట్లే కనిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణపై రాజ్‌భవన్‌కు సమాచారం అందినట్లు తెలుస్తోంది.మంత్రి వర్గ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ముగ్గురిని తప్పించి, ఐదుగురిని మంత్రి వర్గంలోకి తీసుకోవడానికి ముఖ్యమంత్రికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందనే నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు ముఖ్యమంత్రి మాట నెగ్గించుకున్న సూచనలు కనిపించాయి. అయితే, ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాటలను కూడా పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవి వర్గానికి చెందిన ఇద్దరికి మాత్రమే మంత్రివర్గ విస్తరణను పరిమితం చేయాలని పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, శానససభ్యుడు గంటా శ్రీనివాసరావులను మంత్రి వర్గంలోకి తీసుకోవడానికి రేపు గురువారం మంత్రి వర్గ విస్తరణ జరుగనుంది. మంత్రి వర్గ విస్తరణకు ఏర్పాటు చేయాలని సాధారణ పరిపాలనా శాఖకు ఆదేశాలు అందాయి. కాంగ్రెసుకు చెందినవారికి ఈసారి మంత్రి పదవులు దక్కే అవకాశాలు లేవని దీన్ని బట్టి అర్థమవుతోంది.

No comments:

Post a Comment