తనను మంత్రిగా ఉంచినా, తీసేసినా స్వాగతిస్తానని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి
డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. మంత్రి వర్గ మార్పులపై మీడియా ప్రతినిధులు
అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బుధవారం సాయంత్రం సమధానాలు ఇచ్చారు. తనను మంత్రి
వర్గం నుంచి తొలగించినా కాంగ్రెసు పార్టీకే కట్టుబడి ఉంటానని ఆయన
చెప్పారు. తాను ముఖ్యమంత్రికి వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.
మంత్రివర్గంలో చేర్పులు, మార్పుల వల్ల ప్రభుత్వం గందరగోళంలో ఏమీ పడదని ఆయన
అన్నారు. మంత్రి వర్గం నుంచి కొంత మందిని తీసేసి, మరి కొంత మందిని
తొలగించినంత మాత్రాన ప్రభుత్వంలో గందరగోళం ఏమీ ఏర్పడదని ఆయన అన్నారు.
మంత్రి వర్గంలో తాను ఎవరినీ ఉంచాలని, ఎవర్నీ తీసేయాలి గానీ చెప్పబోనని ఆయన
అన్నారు. మంత్రిగా ఉంటే ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి వీలు కలుగుతుందని ఆయన
చెప్పారు. మంత్రి వర్గం విస్తరణ అనేది ముఖ్యమంత్రి ఇష్టానుసారం
జరుగుతుందని ఆయన అన్నారు.
No comments:
Post a Comment