కడప జిల్లాకు రూ.62 కోట్లు మంజూరు
13వ ఆర్ధిక సంఘం ద్వారా జిల్లాకు 2012-13 సంవత్సరానికి రూ.62 కోట్లు
మంజూరైనట్లు మున్సిపల్ రీజనల్ డెరైక్టర్ మురళీకృష్ణగౌడ్ తెలిపారు.
నగరపాలక సంస్థలోని కమిషనర్ ఛాంబర్‌లో ఆయన విలేకరులతో
మాట్లాడారు. ఈ నిధులలో కడప కార్పొరేషన్‌కు రూ.6కోట్లు, ప్రొద్దుటూరుకు
రూ.3 కోట్లు, పులివెందులకు కోటి, జమ్మలమడుగుకు రూ. 82 లక్షలు, రాజంపేటకు
రూ. 77లక్షలు, రాయచోటికి రూ. 1.45 కోట్లు, బద్వేలుకు రూ.1.03 కోట్లు
మంజూరైనట్లు తెలిపారు. కడప కార్పొరేషన్‌కు 76, ప్రొద్దుటూరుకు 27,
బద్వేలుకు 41, జమ్మలమడుగుకు 37, పులివెందులకు 31, రాజంపేటకు 27, రాయచోటికి
41 పోస్టులు మంజూరయ్యాయన్నారు. వీటిని 50 శాతం పదోన్నతుల ద్వారా, 55 శాతం
నియామకాల ద్వారా మూడు దశల్లో భర్తీ చేస్తామన్నారు. కడప కార్పొరేషన్‌లో
మొత్తం 77,561 ఇళ్లు ఉండగా, అందులో 14,068 ఇళ్లకు మాత్రమే పన్నులు
పెరిగాయన్నారు. అలాగే నాన్ రెసిడెన్షియల్‌కు సంబంధించి 9450 భవనాలకు గాను
3957 భవనాలకు పన్నులు పెరిగాయన్నారు. దీని ద్వారా రెసిడెన్షియల్‌లో 56
లక్షలు, నాన్ రెసిడెన్షియల్‌లో రూ.1.60 కోట్లు కార్పొరేషన్‌కు ఆదాయం
వచ్చిందన్నారు. మొత్తమ్మీద కడపలో 23 శాతం మాత్రమే పన్నులు పెరిగాయన్నారు.
No comments:
Post a Comment