అనంతలో మొదటి సారి 33వ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ సీనియర్ ఛాంపియన్
షిప్‌పోటీలు ప్రారంభం అయ్యాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన
సాఫ్ట్‌బాల్ క్రీడాకారులు అనంతకు మొదటి సారి వచ్చారు. ఈనెల 23వ తేదీ వరకు
అనంతలో సంజీవరెడ్డి స్టేడియంలో, ఆర్డీటీ క్రీడా గ్రామంలో ఈ పోటీలు
నిర్వహిస్తున్నారు. పోటీలలో పాల్గొనడానికి 25 పురుష జట్లు, 22 మహిళా జట్లు
వచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు
జితేంద్రరెడ్డి అధ్యక్షతన ప్రారంబోత్సవ సభను ఆర్డీటీ స్టేడియంలో
నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి,
ఎమ్మెల్సీ గేయానంద్, ఆల్ఇండియా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు
పి.ఎన్.పిసి. జేసీ అనితారామచంద్రన్, మాంచోఫెర్రర్ జ్యోతి ప్రజ్వలన చేసి
కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా,
రాష్ట్ర, జాతీయస్థాయి జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల
నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చుఫాస్టు నిర్వహించారు. సభ అధ్యక్షులు
జితేంద్రరెడ్డి వినతిమేరకు ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి 33వ జాతీయస్థాయి
సీనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి,
శాంతి కపోతాలను ఎగురవేశారు. ఆదరణకు కొదువలేదు
కరువు జిల్లా అయిన అనంతలో ఆదరణకు కొదువలేదు. జాతీయస్థాయి చాంపియన్ షిప్
ఇక్కడ జరగడం ఆనందంగా ఉంది.
సాఫ్ట్‌బాల్ అకాడమికి కృషి - మాంచోఫెర్రర్
వివిధ క్రీడలతోపాటు సాఫ్ట్‌బాల్‌ను కూడా అభివృద్ధి చేసేందుకు కృషి
చేస్తామన్నారు. సాఫ్ట్‌బాల్ అకాడమి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
ఫోటోలు
హోరాహోరీగా మ్యాచ్‌లు..
అనంతలో మొదటి సారి 33వ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ సీనియర్ ఛాంపియన్
షిప్‌పోటీలు పోటాపోటీగా జరుగుతున్నాయి. మొత్తం ఐదు మైదానాలలో ఈ మ్యాచ్‌లను
నిర్వహిస్తున్నారు. మొదటి రోజు మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి.పురుషుల విభాగంలో...
కర్ణాటక-ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 4-1 స్కోరుతో
గెలుపొందింది. కేరళ-ఉత్తరప్రదేశ్ మధ్య జరిగిన పోటీలో కేరళ జట్టు 14-0
పాయింట్లతో విజయం పొందింది. ఛత్తీస్‌ఘడ్-బీహార్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో
ఛత్తీస్‌ఘడ్ మ్యాచ్ 11-1 స్కోరుతో విజయం చేజిక్కించుకుంది.
మహిళల విభాగంలో...
జమ్మూకాశ్మీర్-మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జమ్మూకాశ్మీర్ 10-0
స్కోరుతో గెలుపొందింది. ఛత్తీస్‌ఘడ్-ఒడిసా మధ్య జరిగిన మ్యాచ్‌లో 8-8తో
డ్రాగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్-హిమాచల్‌ప్రదేశ్ మధ్య పోటీలో
హిమాచల్‌ప్రదేశ్ 6-0 స్కోరుతో గెలుపొందింది. మేఘాలయ-తమిళనాడు మధ్య మ్యా
చ్‌లో మేఘాలయ జట్టు 10-0 స్కోరుతో విజయం దక్కించుకున్నారు
No comments:
Post a Comment