Monday, 5 December 2011

చంద్రబాబు నాయుడు పై విజయమ్మ వ్యాఖ్యలు

చంద్రబాబు వైయస్‌ను విమర్శిస్తుంటే అధికార పక్షం మాట్లాడక పోవడం బాధాకరమని, వైయస్ నిరంతరం కృషి చేసి కాంగ్రెసును అధికారంలోకి తీసుకు వచ్చారన్నారు. వైయస్ అసెంబ్లీలో మాట్లాడుతుంటే తాను టీవీల్లో చూసేదాన్నని ఆవేదనగా చెప్పారు. ఇది చాలా దురదృష్టకరమైన రోజని అన్నారు. అవిశ్వాసం ఎవరు పెట్టినా మద్దతిస్తామన్న జగన్ మాట ప్రకారమే టిడిపికి అండగా నిలబడుతున్నామన్నారు. అవిశ్వాసం ఎవరు పెట్టారన్నది తమకు ముఖ్యం కాదన్నారు. రైతులకు ప్రభుత్వం ఏమీ చేయలేక పోతోందని విమర్శించారు. వైయస్ ఉన్నప్పుడు రైతులకు భరోసా ఉండేదని కాని ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. వైయస్ మృతిని తట్టుకోలేక చనిపోయిన వారిని ప్రభుత్వం ఇప్పటి వరకు పరామర్శించిందా అన్నారు. వైయస్ కాంగ్రెసును రెండు సార్లు గెలిపించారని కానీ ఆయన మృతి తర్వాత కాంగ్రెసు ఆయనకు ఏం బహుమతి ఇచ్చిందని ప్రశ్నించారు.అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓ వర్గం మీడియాతో కలిసి వైయస్‌పై కుట్ర చేస్తున్నాయన్నారు. జగన్‌కు కాంగ్రెసు పొమ్మన లేక పొగపెట్టిందన్నారు. అధికారం కోసమే తాము ప్రయత్నించినట్లుగా చిత్రీకరిస్తున్నారన్నారు. తమను బయటకు పంపడమే కాంగ్రెసు వైయస్‌కు ఇచ్చిన బహుమతా? అని ప్రశ్నించారు. వైయస్ ప్రవేశ పెట్టిన పథకాలను ప్రభుత్వం పూర్తిగా నీరుగారుస్తుందని విమర్శించారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు కుమ్మక్కైందని ఎవరు విమర్శలు చేసినప్పటికీ వైయస్ ఆశయాలు నీరుగారుస్తున్న కాంగ్రెసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్‌ను అభిమానించే ఎమ్మెల్యేలు ఓటు వేయాలని సూచించారు

No comments:

Post a Comment