కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో జరుగుతున్న అవిశ్వాస తీర్మానం సందర్బంగా ఆమె సభకు హాజరయ్యారు. ఆమె వెంట జగన్ వర్గం ఎమ్మెలు 19 మంది సభకు చేరుకున్నారు. మహిళా ఎమ్మెల్యేలు సుచరిత, కొండ సురేఖ దగ్గరుండి వైఎస్ విజయమ్మను సభలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు.
ప్రభుత్వం తమ పార్టీ ఎమ్మెల్యే లను బెదిరిస్తుందని, అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని డబ్బును, పదవుల్ని ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఎరగా చూపుతుందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు
No comments:
Post a Comment