తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై విజయవాడ పార్లమెంటు
సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సోమవారం జోస్యం చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వానికి 171 మంది ఎమ్మెల్యేల ఓట్లు వస్తాయని చెప్పారు. టిడిపి
పెట్టిన అవిశ్వాసం వీగిపోతుందన్నారు. టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు తన
హయాంలో రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెసు ప్రభుత్వం రైతులకు
ఎంతో చేస్తుందన్నారు.తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు
నాయుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఏఐసిసి అధికార ప్రతినిధి
రేణుకా చౌదరి విమర్శించారు. టిడిపి పెట్టిన అవిశ్వాసాన్ని తాము
స్వాగతిస్తున్నామని చెప్పారు. మా బలాన్ని మేం నిరూపించుకుంటామన్నారు.
కార్యకర్తల అభిప్రాయం మేరకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్
జగన్ ఎమ్మెల్యేలు తిరిగి వస్తున్నారన్నారు
No comments:
Post a Comment