తిరుపతిని వరల్డ్‌క్లాస్ రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి !
తిరుపతికి పెరుగుతున్న రద్దీ నేపథ్యం లో ప్రయాణికులకు సరిపడేలా వసతి,
తాగునీరు, సౌకర్యాల కల్పనకు తగు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్నా రు.
స్టేషన్‌కు ఎదురుగా ఉన్న రిజర్వేష న్ కార్యాలయంలో ఎదురయ్యే ఇబ్బం దులు,
విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని గతంలో దక్షిణం వైపు ఆర్‌సీరోడ్డులో
కొత్త రిజర్వేషన్ కమ్ జనరల్ బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. సరైన
ప్రచారం లేని కారణంగా అక్కడ సిబ్బంది పనిలేక ఖాళీగా కూర్చోవాల్సిన
పరిస్థితులను గమనిం చిన డీఆర్‌ఎం స్థానిక రైల్వే అధికారుల కు తగు
ఆదేశాలిచ్చారు. అనంతరం రైలు బోగీలను శుభ్రం చేసే ఫిట్‌లైన్లు, మురికినీటి
పంపింగ్, క్లీనింగ్, ఆర్‌వో వాటర్ ప్లాంట్ పనితీరులను తనిఖీ చేసి
అధికారులకు పలు సూచనలు చేశారు. స్టేషన్‌కు తూర్పు వైపున్న
రైల్వేట్రాక్‌లు, ట్రాక్‌లకు మధ్య ఏర్పాటు చేసిన మురికి నీటి కాలువలను
పరిశీ లించి నీటి ప్రవాహం సక్రమంగా జరిగే లా చూడాలని రైల్వే హెల్త్ అండ్
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ వర్క్స్ విభాగం అధికారులను కోరారు. ప్రస్తుతం తిరుపతి
రైల్వేస్టేషన్‌లో ఉన్న నాలుగు ఫిట్‌లైన్లు బోగీల శుభ్రతకు సరిపోవడం లేదని, ఆ
ప్రభావం డైలీ ట్రైన్ల వేళలపై పడుతోందని స్థానిక అధికారులు డీఆర్‌ఎంకు
వివరించారు. ఫిట్‌లైన్ల పెంపుదలకు ఉన్న సాధ్యాసాధ్యాలపై తనకు నివేదిక ఇస్తే
జోనల్ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటానని హా మీ ఇచ్చారు. గత
పర్యటనలో చేపట్టిన తనిఖీల్లో చోటు చేసుకున్న అంశాలపై మార్పు వచ్చిందా,
లేదా? అని పరిశీలించారు.
No comments:
Post a Comment