Thursday, 15 December 2011

జీవిత, రాజశేఖర్‌లకు కోర్టు సమన్లు జారీ

సినీ నిర్మాత అల్లు అరవింద్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో సినిమా నటీనటులు జీవిత, రాజశేఖర్‌లకు నాంపల్లి కోర్టు గురువారం నాడు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 9 వ తేదీన వీరిరువురూ కోర్టు ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ జీవిత, రాజశేఖర్ కొన్నాళ్ల క్రితం ఆరోపించిన విషయం తెలిసిందే. చిరంజీవి చారిటబుల్ ట్రస్టుపై జీవిత, రాజశేఖర్ చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని, ఈ దంపతులు తప్పుడు ఆరోపణలు చేశారనీ అల్లు అరవింద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాము ప్రజా సేవ చేస్తున్నామే తప్ప వ్యాపారం చేయడంలేదని, కావాలంటే ఈ విషయమై ప్రభుత్వం ఏ దర్యాప్తు సంస్థతోనైనా దర్యాప్తు చేయించుకోవచ్చునని అప్పట్లోనే బ్లడ్ బ్యాంకు నిర్వాహకుల నుంచి వివరణ వచ్చింది. ఈ విషయమై అల్లు అరవింద్ వేసిన పిటిషన్‌పై ఇప్పుడు నాంపల్లి కోర్టు ఈ సమన్లు జారీ చేసింది.

No comments:

Post a Comment