కొన్నాళ్లుగా ప్రాణాపాయం ఉందని చెబుతున్న పటోళ్ల గోవర్ధన్ రెడ్డి మంగళవారం
మధ్యాహ్నం రాజధాని నడిబొడ్డున దారుణ హత్యకు గురయ్యాడు. అబిడ్స్ సమీపంలోని
బొగ్గులకుంట ప్రాంతంలో ఈ హత్య జరిగింది. పటోళ్లను హతమార్చిన వెంటనే హంతకులు
ద్విచక్రవాహనంపై పారిపోయినట్టు తెలుస్తున్నది. పరిటాల రవి హత్య కేసులో
నిర్దోషిగా ఇటీవల విడుదలైన పటోళ్ల గోవర్ధన్ రెడ్డి అనేక హత్య కేసులలో
నిందితుడు.
పటోళ్ల మంగళవారం మధ్యాహ్నం తెలుగు అకాడమీ ప్రాంతంలో ఒక ఆటో ఎక్కి
అబిడ్స్‌కు బయలుదేరాడు. చూస్తుండగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు
నాలుగైదు ద్విచక్ర వాహనాలలో వచ్చి తన ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తిని
హతమార్చారని, అతడు ప్రాణాలు కోల్పోయిన తర్వాతే వారు పరారయ్యారని ఆటో
డ్రైవర్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తున్నది.
హత్య జరిగిన వెంటనే కొందరు స్థానికులు ఆటో దగ్గరకు రాబోగా ఎవ్వరూ దగ్గరకు
రావద్దని హంతకులు హెచ్చరించినట్టు తెలుస్తున్నది. రంగారెడ్డి జిల్లా
తాండూరుకు చెందిన పటోళ్ల గోవర్థన రెడ్డికి హైదరాబాద్‌లో జరిగిన అనేక
హత్యలతో సంబంధం ఉన్నట్టు తెలుస్తున్నది. ఆర్.పి.టి. అనే సంస్థను
ప్రారంభించిన పటోళ్ల ఇటీవలే చర్లపల్లి జైలునుంచి విడుదల అయ్యాడు. పరిటాల
రవి హత్య కేసులో నిందితుడైన పటోళ్ళ హత్య వార్త అనంతపురం జిల్లాలో సంచలనం
సృష్టించింది.
No comments:
Post a Comment