అన్నా హజారే అవినీతి ఉద్యమం కోసం రజనీకాంత్ ఉచితంగా..రూ. 8లక్షల
అవినీతిపై పోరాటం చేస్తున్న అన్నా హజారే బృందం ఆర్థిక సమస్యలతో సతమతం
అవుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో దీక్ష చేయడానికి ఎంఎంఆర్‌డి గ్రౌండ్ కు
రూ. 8లక్షల అద్దె కట్టే స్తోమత లేక తమ ప్రయత్నాన్ని విరమించుకుంది అన్నా
బృందం. అయితే అన్నా అవినీతి పోరాటానికి సూపర్ స్టార్ రజనీ కాంత్ అండగా
నిలవడానికి ముందుకు వచ్చారు. చెన్నయ్ లో దీక్ష చేస్తే నగరం నడి ఒడ్డున గల
తన రాఘవేంద్ర కళ్యాణ మంటపాన్ని మూడు రోజుల పాటు ఉచితం ఇచ్చేందుకు
అంగీకరించారు. భారత అవినీతి వ్యతిరేక కమిటీ మెంబర్ ఎంఎస్.
చంద్రమోహన్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడిస్తూ....తమ అభ్యర్థనకు రజనీకాంత్
సానుకూలంగా స్పందించారని, కళ్యాణ మంటపాన్ని దీక్ష కోసం ఉచితంగా ఇచ్చేందుకు
అంగీకరించారని వెల్లడించారు. ఇప్పటికే అనేక మందికి అండగా నిలుస్తూ
సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్...తాజాగా అవినీతి కి వ్యతిరేకంగా
సాగుతున్న పోరాటానికి తన వంతు సాయం చేయడంపై అభిమానులు ఆనందం వ్యక్తం
చేస్తున్నారు.
No comments:
Post a Comment