పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అభిమానులకు న్యూఇయర్ రోజు గిఫ్టు
2011 సంవత్సరంలో ఒక్క సినిమా కూడా విడుదల చేయకుండా అభిమానులను నిరాశ పరిచిన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ న్యూఇయర్ రోజు గిఫ్టుతో అభిమానుల ముందుకు
వస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ సంపత్ నంది దర్శకత్వంలో ‘రచ్చ’ సినిమా
చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎలా కనిపించబోతున్నాడనే ఆసక్తి మెగా
అభిమానులందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో జనవరి 1న రచ్చ తొలి ట్రైలర్ ను
విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రచ్చ సినిమాపై ఓ మెగా
అభిమాని మాట్లాడుతూ ‘‘ రచ్చ సినిమాలో రామ్ చరణ్ న్యూ గెటప్ ను చూడటానికి
మేమంతా ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నాం, న్యూ ఇయర్ రోజు ట్రైలర్ విడుదలైతే దాన్ని
మాకు అందిన బహుమతిగా భావిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. మాస్ అండ్
యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చెర్రీ మెడికల్ స్టూండెంట్
పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి సినిమాలోని ‘వాన వాన వెల్లువాయే’ పాటను ఈ
చిత్రంలో రీమిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మార్చిలో రచ్చ
సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మెగా సూపర్ గుడ్ మూవీస్
బ్యానర్ పై ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ ఈ చిత్రానికి నిర్మాతలు.
No comments:
Post a Comment