Thursday, 8 December 2011

ఫేస్‌బుక్‌లో పుట్టిన ప్రేమ

ఫేస్‌బుక్‌లో పుట్టిన ప్రేమ సెల్‌ఫోన్లో చిగు రించింది. చివరికి పోలీస్‌స్టేషన్ చేర్చింది. ఇంతా చేస్తే అమ్మాయి వయసు 14. అబ్బాయి మొహం ఒక్కసారి కూడా చూసిందిలేదు. అయినా ఇల్లు వదిలి వెళ్లిపోయింది. టెక్నాలజీ కొంపముంచు తుందనడానికి ఇదో ఉదాహరణ.చిత్తూరు పట్టణానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఇంటర్నెట్‌లో ఫేస్‌బుక్ మెంబర్. ఆమెకు కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన ఒక యువకుడు నెట్‌లో మూడు నెలల క్రితం పరిచయమయ్యాడు. చాటింగ్ మొదలయ్యింది. ఇద్దరూ నెట్‌లోనూ, సెల్‌ఫోన్లలోనూ గంటల తరబడి మాట్లాడారు. ఈనెల 4వ తేదీ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారి 7 వరకు మాట్లాడుతూనే ఉండిపోయారు. మధ్యలో వందలకొద్దీ ప్రేమ సందేశాలు పంపుకున్నారు (ఎస్‌ఎంఎస్). మరుసటి రోజు అమ్మాయి స్కూలుకు వెళ్లలేదు. ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు కంగారుపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి సెల్ కాల్స్ పరిశీలించిన పోలీసులకు రాజంపేట సమీపంలోని తాళ్లపాక గ్రామానికి చెందిన యువకుడితో ఆమె తరచూ మాట్లాడుతోందని అర్థమైంది. అక్కడికెళ్లి డిగ్రీ చదువుతున్న అబ్బాయిని అదుపులోకి తీసుకుని చిత్తూరు తీసుకువచ్చారు. అమ్మాయిని కూడా కడపలో బుధవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో కడపకు చెందిన మరో అబ్బాయి కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. గురువారానికి పూర్తి వివరాలు వెల్లడవుతాయి

No comments:

Post a Comment