Thursday, 8 December 2011

మహేంద్ర సింగ్ ధోనీకి మావోయిస్టులు, ఉగ్రవాదుల నుంచి ముప్పు

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మావోయిస్టులు, ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో ధోనీకి మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. విండీస్‌తో వన్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న మహీ భార్య సాక్షితో కలసి ఇటీవల సొంతూరు రాంచీకి విచ్చేశాడు. ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ధోనీకి భారీ భద్రత కల్పించినట్టు ఆ అధికారి చెప్పారు. రక్షణ చర్యల్లో భాగంగా జార్ఖండ్ ఆర్మ్‌డ్ పోలీసు కమాండోలను నియమించినట్టు తెలిపారు. ధోనీ ఇంటివద్ద సాధారణ దుస్తుల్లో భద్రత సిబ్బంది పహారా కాస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో ధోనీ ఎక్కడికి వెళ్లినా అతని వెంట సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు.

No comments:

Post a Comment