చిరంజీవి బ్లాడ్ బ్యాంక్‌పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని సినీ నటి,
దర్శక నిర్మాత జీవిత రాజశేఖర్ చెప్పారు. తమకు వచ్చిన సమన్లుపై న్యాయపోరాటం
చేస్తామని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చిరంజీవి
బ్లడ్ బ్యాంక్‌పై సినీ నటులు డాక్టర్ రాజశేఖర్, జీవిత చేసిన ఆరోపణలపై పరువు
నష్టం దావా వేసిన కేసుకు సంబంధించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సోమవారం
12వ తేదీన నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాన్ని
న్యాయస్థానం నమోదు చేసుకుంది. తదుపరి కేసు విచారణను ఈ నెల 15వ తేదీకి
వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా చిరంజీవి డబ్బులకు బ్లడ్
బ్యాంక్‌లో రక్తాన్ని అమ్ముకుంటున్నారని జీవిత, రాజశేఖర్‌లు విమర్శలు చేసిన
విషయం తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై గతంలో జీవిత, రాజశేఖర్ తీవ్ర
ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. చిరంజీవి
బ్లడ్ బ్యాంకులో ఏ విధమైన అక్రమాలు జరగడం లేదని విచారణలో తేలింది. ఈ
నేపథ్యంలో జీవిత, రాజశేఖర్‌లపై అల్లు అరవింద్ కోర్టులో పరువు నష్టం దావా
వేశారు.
No comments:
Post a Comment