Friday, 16 December 2011

ఆమెకు మంత్రిగా చెయ్యాలనేది డ్రీమ్...హీరోయిన్ రోజా

సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చిన రోజా మళ్లీ సెకండ్ ఎంట్రీ ప్రారంభించి నెగిటివ్ పాత్రలు,తల్లి పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడామె ఓ తమిళ చిత్రంలో ఐటం సాంగ్ చేయనుంది. వెట్టైవాడు టైటిల్ తో రూపొందే ఆ చిత్రంలో ఆమె నటుడు ఫాండ్యరాజన్ తో కలిసి డాన్స్ చేస్తోంది. విజయ్ బాలన్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అంతా కొత్త నటీనటులను పరిచయం చేస్తూ రూపొందిస్తున్నారు. ఇక రోజా రీసెంట్ గా శ్రీరామరాజ్యం చిత్రంలో భూదేవి గా నటించింది. అలాగే మొగుడు చిత్రంలో తాప్సీకి తల్లిగా, గోపీచంద్ కి అత్తగా,ఓ మినిస్టర్ గా సమర్ధవంతంగా నటించి శభాష్ అనిపించుకుంది. ఆ చిత్రంలో హీరోయిన్ తల్లిగా రోజా చేసింది.ఆమెకు ఎప్పటినుంచో కృష్ణవంశీ దర్శకత్వంలో చేయాలనే కోరిక.అది తీరటం ఒకెత్తు అయితే ఆమెకు మంత్రిగా చెయ్యాలనేది డ్రీమ్.. అది కూడా ఈ చిత్రంతో తీరింది అంటున్నారు. ఈ చిత్రంలో రోజాది మంత్రి పాత్ర. ఇక రోజా వంటి సీనియర్ నటి నటించటం వల్ల ఆ పాత్రకు నిండుతనం వచ్చిందని అంటున్నారు.సినిమా రిజల్టు నెగిటివ్ గా ఉన్నా రోజా పాత్ర మాత్రం హైలెట్ అయ్యింది.

No comments:

Post a Comment