Friday, 16 December 2011

తిరుపతి ప్రజాసమస్యలు గాలికొదిలేసిన... చిరంజీవి

పదవులు తప్ప ప్రజా ప్రయోజనాలు తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవికి పట్టవని  ఈసందర్భంగా ప్రజలనుద్దేసించి కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి ప్రజాసమస్యలను గాలికి వదిలేసి మంత్రి పదవి దక్కించుకునే పనిలో బిజిగా వున్నారన్నారు. ఎమ్మెల్యేగా చిరంజీవి పనికిరాడన్న విషయాన్ని ప్రజలు ఎప్పుడో తేల్చేశారన్నారు. అందుకే ఆయన ఎక్కడ తిరిగినా మహిళలు తిరగబడుతున్నారన్నారు. ఇటీవల చింతలచేనుకు వచ్చి కనీసం ప్రజలతో మాట్లాడకుండా అక్కడ నుండి పారిపోయిన సంఘటనలున్నాయన్నారు. నగరంలో కనీసం దోమల నియంత్రణకు కూడా చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో చిరంజీవి వున్నారన్నారు. ప్రజలు కూడా నేడు చిరుకు ఎందుకు ఓట్లు వేశామా? అని బాధపడుతున్నారన్నారు. తాము గత మూడు రోజులుగా వార్డులలో తిరుగుతుంటే కుప్పలు తెప్పలుగా వినతులు వస్తున్నాయన్నారు. వైఎస్ పాలనలో రాష్ట్రం ఎంతో సుభిక్షంగా వుండేదన్నారు. అయితే నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. అభివృద్ది, సంక్షేమం రెండుకళ్లుగా ప్రజారంజకంగా పాలన చేశారన్నారు. అయితే నేడు రచ్చబండ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహించి ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నారన్నారు.

No comments:

Post a Comment