2011-12 విద్యా సంవత్సరానికి సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ
విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయా
కళాశాలల విద్యార్థులు దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాల్సి
రావడం, ఈ ప్రక్రియలో సాంకేతిక లోపం తలెత్తడంతో విద్యార్థులు ఆన్‌లైన్
కష్టాలు ఎదుర్కొంటున్నారు.దరఖాస్తుల స్వీకరణకు గతనెలాఖరు వరకే
గడువు ఇచ్చినా ఈనెల 15 వరకు పొడిగించారు. అయినప్పటికీ దరఖాస్తులు
ఆన్‌లైన్‌లో న మోదు కాకపోవడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు.
కోవెలకుంట్ల డివిజన్ లో ఐదు ప్రభుత్వ, రెండు ప్రైవేట్ జూని యర్ కళాశాలలు
ఉన్నాయి. విద్యార్థి అడ్మిషన్ ఆధారంగా దరఖాస్తును ఆన్‌లైన్ ద్వారా పంపాల్సి
ఉంది. అడ్మిషన్ నంబ ర్లు నమోదు చేయగా ఆ దరఖాస్తును ఆన్‌లైన్
స్వీకరించడంలేదని కొందరు విద్యార్థులు వాపోతున్నారు.ప్రభుత్వ
జూనియ ర్ కళాశాలలో మొదటి సంవత్సరం సీఈ సీ చదువుతున్న మహమ్మద్ అనే
విద్యార్థి 8422 అడ్మిషన్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో న మోదు చేయగా ఈ నంబరుకు
సంబంధించిన కళాశాల ఉపకార వేతనాల జాబి తాలోలేదని, మరోసారి చెక్ చేసుకోవాలని
సూచిస్తోంది. ఇదే కళాశాలలో మల్టీ పర్పర్స్ హెల్త్
వర్కర్స్(ఎంపీహెచ్‌డబ్ల్యు) కోర్సు చేస్తున్న 15మంది విద్యార్థినుల
అడ్మిషన్ నంబర్లు నమోదు చేయగా కళాశాల పేరే చూపించకపోవడం గమనార్హం.
కోవెలకుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే వివిధ గ్రూపులకు సంబంధించి 60మంది
విద్యార్థుల దరఖాస్తులు రిజిస్టర్ కానట్లు తెలుస్తోంది. మిగతా కళాశాలల్లో
కూడా ఎక్కువ మంది విద్యార్థుల దరఖాస్తులను స్వీకరించకపోవడం, గడు వు దగ్గర
పడుతుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ఈ
ఏడాది విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలోనే స్టేట్
బ్యాంకు అకౌంట్ నంబర్‌ను జత చేయాలని చెప్పడంతో ఒకేసారి అంత మంది
విద్యార్థులకు బ్యాంకు అధికారులు ఖాతాలు ప్రారంభించేందుకు నిరాకరించడంతో
విద్యార్థులు గత నెలలో అకౌంట్ల కోసం వారం రోజులపాటు క్లాసులు వదులుకుని
బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆదాయ, కుల ధ్రువీకరణ
పత్రాల కోసం పడరానిపాట్లు పడ్డారు. తీరా సర్టిఫికెట్లన్నీ సమకూర్చుకోగా
ఆన్‌లైన్ మొరాయించడంతో విద్యార్థులు లబోదిబోమంటున్నారు. సంబంధిత అధికారులు
ఆన్‌లైన్‌లో నెలకొన్న సాంకేతిక లోపాన్ని వెంటనే సరిచేయాలని విద్యార్థుల
తల్లిదండ్రులు కోరుతున్నారు.
No comments:
Post a Comment