వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్
జగన్మోహన్ రెడ్డి వర్గం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డిపై
స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ప్రజారాజ్యం పార్టీ ఫిర్యాదు చేసింది.
చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం విప్ వంగా గీత శుక్రవారం సాయంత్రం
స్పీకర్‌కు శోభా నాగిరెడ్డి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస
తీర్మానం ప్రవేశ పెట్టిన సమయంలో పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఆమె ఓటు వేసిన
విషయం తెలిసిందే. అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ జారీ
చేసినప్పటికీ ఆమె మాత్రం అనుకూలంగానే ఓటు వేశారు. దీంతో తీవ్ర తర్జన భర్జన
అనంతరం చిరు ఫిర్యాదు చేసేందుకు నిర్ణయించుకున్నారు.2009 ఎన్నికల
సమయంలో ఆళ్లగడ్డ పిఆర్పీ వర్గాలు శోభకు టిక్కెట్ వ్యతిరేకించినప్పటికీ
చిరంజీవి ఇచ్చారని సమాచారం. ఇప్పుడు ఆమె తీరు చూసి చిరంజీవి ఆవేదన
చెందుతున్నారట. మిగిలిన ఎమ్మెల్యేలంతా తనతో ఉంటున్నారు. కానీ కేడర్
వద్దంటున్నా టిక్కెట్ ఇచ్చి గెలిపించిన ఆమె వైఖరితో మాత్రం చిరంజీవిని
ఆగ్రహానికి గురి చేస్తుందట
నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అనే సామెత ఇలాంటి వాల్లకు సరిగ్గ అతుకుతుంది. అత్యుత్తమ రాజకీయ బఫూన్ అవార్డ్ పెదితే మన చిరు కు పొటీ లేకుండా ఏకగ్రీవంగా ఇవ్వవచ్చు. కాంగ్రెస్ దృతరాష్ట్ర కౌగిలి గురించి మనోడికి ఇంకా పూర్తిగా అవగాహన కలగలేదు. కలిగినా ఏంచెస్తాడులెండి. సూపర్ స్టార్ కృష్ణ లాంటి వాళ్ళే పునరాలొచనలో పదుతున్నారు. ప్రజల అభీష్టానికి విరుద్ధంగా పార్టీని కాంగ్రెస్ కు అమ్ముకున్న చిరంజీవి లాంటి ద్రోహులను శిక్షించేందుకు చట్టం తేవాల్సి వుంది.
ReplyDelete