
తెరపై చాలా అందంగా కనిపించే హీరోల్లో మహేష్ ఒకడు. అతను చక్కని పర్ఫార్మర్.
అతని కామెడీ టైమింగ్ కానీ, డైలాగ్ డిక్షన్ కానీ మిగతా హీరోలతో పోలిస్తే
భిన్నం. నా దృష్టిలో ఆల్‌రౌండ్ యాక్టర్. అతనితో కలిసి పనిచేస్తుండటం వెరీ
హ్యాపీ అంటూ మహేష్ ని పొగడ్తల్లో ముంచెత్తారు వెంకటేష్. అడ్డాల శ్రీకాంత్
దర్శకత్వం వహిస్తున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' షూటింగ్‌లో ఈ నెల
16 నుంచి తాను వెంకటేష్ పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా మహేష్ గురించి
మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే చిత్రం కథ గురించి చెప్తూ..ఇద్దరు
సోదరుల జీవన ప్రయాణం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అన్నారు. అలాగే
కొంత కాలం నుంచి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నేను ఆ సబ్జెక్టుపై కలిసి
చర్చించుకుంటూ ఉన్నాం. కమర్షియల్ అంశాలన్నీ బాగా కుదిరిన ఫ్యామిలీ
డ్రామా ఈ చిత్రం. మహేష్, నేను ఈ సినిమాలో చేయడం కోసం ఆసక్తిగా
ఎదురుచూస్తున్నాం. ఇద్దరం ఈ సినిమా గురించి మాట్లాడుకున్నాం. సబ్జెక్టు
విషయంలో, మా పాత్రల విషయంలో చాలా సంతోషంగా ఉన్నాం. కాగా ఈ సినిమా
షూటింగ్‌లో మహేష్ జనవరి నుంచి పాల్గొననున్నారు అని చెప్పుకొచ్చారు.
ఇది వెంకటేష్ విజ్ఞత !
ReplyDelete