
వారికి
మద్దతుగా రంగంలోకి దిగిన రాజకీయ పార్టీల నాయకులు షట్టర్లకు అడ్డుగా వేసిన
మట్టిని జేసీ ఆధ్వర్యంలో తొలగించిన తాడిపత్రి రైతులు కట్టలు గాలికి పోతుంటే
ఏకులు ఏరుకున్నారనే చందంగా తయారయ్యారు మన నేతలు.
హెచ్చెల్సీకి న్యాయంగా రావాల్సిన నీటి వాటాకు దారుణంగా కోత పడుతుంటే
గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయడం మాని వచ్చిన అరకొర నీటి కోసం
రచ్చకెక్కుతున్నారు. మంత్రి శైలజానాథ్, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్
రెడ్డి సుబ్బరాయసాగర్ నీటి విషయంలో నువ్వా.. నేనా అనే రీతిలో పోరు
సాగిస్తున్నారు. అనంతపురం:ప్రభుత్వ
అనాలోచిత వైఖరి.. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం అనంతపురం
జిల్లాలో జల యుద్ధానికి దారితీసింది. ఇన్నాళ్లూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి
జీవించిన రెండు నియోజకవర్గాల ప్రజల మధ్య చిచ్చు రేపింది. ఒక నియోజకవర్గం
రైతులకు మంత్రి శైలజానాథ్ మద్దతుగా నిలిస్తే.. మరొక నియోజకవర్గం రైతులకు
మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి దన్నుగా నిలుస్తున్నారు. అధికార పార్టీలో
ఉప్పునిప్పుగా పేరొందిన వీరిద్దరూ ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి తెరతీశారు.
వివరాల్లోకి వెళితే.. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ (హెచ్చెల్సీ) ఆయకట్టులో
తాడిపత్రి బ్రాంచ్ కెనాల్(టీబీసీ) కింద 31,131 ఎకరాల ఆయకట్టు విస్తరించి
ఉంది. ఈ ఏడాది టీబీసీ కింద 1.312 టీఎంసీలతో పది వేల ఎకరాల్లో ఆరుతడి పంటలకు
నీళ్లందించాలని నిర్ణయించారు.
టీబీసీ ఆయకట్టుకు
నీళ్లందించడానికి వీలుగా సుబ్బరాయసాగర్ జలాశయాన్ని హెచ్చెల్సీ నీటితో
నింపుతారు. సుబ్బరాయసాగర్ నీటి నిల్వ సామర్థ్యం 0.48 టీఎంసీలు. ఈ జలాశయం
గేట్లకు మరమ్మతు చేయకపోవడం వల్ల నీళ్లన్నీ వృథా అవుతున్నాయి. ఏనాడూ నీటి
నిల్వ సామర్థ్యం మేరకు నీళ్లను నిల్వచేయలేని దుస్థితి నెలకొంది.
సుబ్బరాయసాగర్ గేట్లకు మరమ్మతు చేయకపోవడానికి ప్రధాన కారణం సున్నపురాళ్ల
గనుల యజమానుల ఒత్తిళ్లకు తలొగ్గడమేనన్న వాదన బలంగా విన్పిస్తోంది. సాగర్‌లో
పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేస్తే సున్నపురాళ్ల గనుల్లోకి నీళ్లు
చేరుతాయి. అప్పుడు ఖనిజాన్ని వెలికితీయడం కష్టమవుతుంది. ఈ గనులన్నీ అధికార
పార్టీకి చెందిన ఓ కీలకప్రజాప్రతినిధి, మరొక సీనియర్ ప్రజాప్రతినిధి,
విపక్ష పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి, వారి అనునయులకు చెందినవి
కావడం గమనార్హం. సుబ్బరాయసాగర్ గేట్లకు మరమ్మతు ఎందుకు చేయడం లేదని
నిలదీస్తే.. నిధుల్లేవనే కారణాన్ని హెచ్చెల్సీ అధికారులు చెప్పడం రివాజుగా
మారిపోయింది. ఇదే తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల ప్రజల మధ్య జల
యుద్ధానికి దారితీసింది.
సుబ్బరాయసాగర్ నుంచి టీబీసీ కెనాల్
ద్వారా తాడిపత్రి, శింగనమల నియోజకవర్గంలో పుట్లూరు, కోమటికుంట్ల చెరువులకు
నీళ్లందుతాయి. సాగర్‌లో నీటిమట్టం ఆరు మీటర్ల మేర ఉంటేనే ఈ కాలువకు నీటిని
విడుదల చేస్తారు. రెండు నియోజకవర్గాల మధ్య నీటి యుద్ధం శాంతిభద్రతలకు
సవాల్‌గా మారడంతో సుబ్బరాయసాగర్ నుంచి నీటి విడుదలను అధికారులు ఆపేశారు.
ఇదే అంశంపై హెచ్చెల్సీ ఎస్‌ఈ టీబీ రవిని వివరణ కోరగా.. రెండు
ప్రాంతాల నేతలతో మాట్లాడుతున్నామని,పరిస్థితినచక్కదిద్దుతున్నామని
వివరించారు.
చెరువులను తప్పకుండా నింపుతాం :మంత్రి శైలజానాథ్
తాగునీటి సమస్యను తీర్చడానికి పుట్లూరు మండలంలోని చెరువులను తప్పకుండా
నింపుతామని మంత్రి శైలజనాథ్ చెప్పారు. మంగళవారం ఆయన తో
ఫోన్‌లో మాట్లాడారు. 15 రోజుల క్రితం ఐదు రోజుల పాటు సుబ్బరాయసాగర్‌లో ఉన్న
నీటిని దౌర్జన్యంగా తీసుకెళ్లినా.. అప్పట్లో ఎవరూ అడ్డుచెప్పలేదన్నారు.
కానీ తాగునీటి కోసం చెరువులకు నీటిని విడుదల చేస్తే అడ్డుకుంటున్నారన్నారు.
మూడేళ్ల నుంచి ఏదో విధంగా పుట్లూరు చెరువులను నింపుతున్నామన్నారు. ప్రజా
సమస్యల విషయంలో ఘర్షణలకు దిగాల్సిన అవసరం లేదని, బుధవారం సాయంత్రం అనంతపురం
వచ్చి, సమస్యపై స్పందిస్తానన్నారు.
|
|
No comments:
Post a Comment