సినీనటుడు సిదార్థపై బెదిరింపు ఫిర్యాదు
ప్రముఖ సినీ నటుడు సిద్ధార్థ్‌పై హత్యాబెదిరింపు కేసు నమోదైంది.
దక్షిణచెన్నయ్ పరిధిలోని లక్ష్మీనగర్‌కు చెందిన డిజైనర్ బాబు పోలీసు
కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఫిర్యాదు చేశారు. సిద్దార్థ, ఆయన తండ్రి
సూర్యనారాయణ కోరిక మేరకు గతంలో వారి ఇంటిని రూ.6 లక్షల 63 వేల వ్యయంతో
అలంకరించారని, అయితే వారు రూ.4 లక్షల 30 వేలు మాత్రమే ముట్టజెప్పి మిగతా
సొమ్ము ఇచ్చేందుకు నిరాకరించారని ఫిర్యాదులో తెలిపారు. ఈ నెల 13వ తేదీన
బాకీ కోసం వారి ఇంటికి వెళ్లిన తనను హత్య చేస్తామని బెదిరించారని, వారిపై
చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా ఆర్థిక నేర
విభాగం సీఐడీ పోలీసులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
No comments:
Post a Comment