ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ మరో సంచలనం రేపారు. సత్యం కుంభకోణంలో బెయిల్‌పై విడుదలైన రామలింగరాజును ఆయన కలిశారు. రెండున్నరేళ్ల జైలు జీవితం అనంతరం రామలింగరాజు శనివారం తొలి సారిగా ఇంటికొచ్చారు. అక్కడే ఆయనతో వర్మ అర్ధగంటకుపైగా భేటీ అయ్యారు. ఈ విషయాన్ని వర్మ సమీప బంధువొకరు «ద్రువీకరించారు. అయితే ఈ భేటీ ఎందుకన్నదీ తెలియరాలేదు. వర్మ ఏదైనా సినిమాకు ప్రణాళిక రూపొందిస్తున్నారా? ఇందులో భాగంగానే రామలింగరాజును కలిశారా? అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి
. 
గతంలో పరిటాల సునీతను, సూరిని కలిసిన అనంతరమే వర్మ.. పరిటాల రవిపై సినిమా తీసే విషయాన్ని వెల్లడించారు. అనంతరం ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంతో ఆయన రూపొందించిన 'రక్త చరిత్ర'పై దుమారం రేగిన సంగతి తెలిసిందే. అలాగే విజయవాడలో రెండు వర్గాల ఆధిపత్య రాజకీయాలపై చిత్ర నిర్మాణం చేపట్టి మరో వివాదానికి తెరతీశారు. 'బెజవాడ రౌడీలు' అన్న టైటిల్‌పై తీవ్ర విమర్శలు రేగడంతో దానిని 'బెజవాడ'గా మార్చారు. ఈ సినిమా కూడా విడుదల అనంతరం వివాదాలు సృష్టించొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సత్యం రామలింగరాజుతో భేటీ జరపడం వెనుకా.. ఏదైనా సినిమా తీసే యోచన ఉండొచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి
No comments:
Post a Comment