Sunday, 6 November 2011

త్రిపుల్ ఐటిల్లో రిలే దీక్షలను ప్రారంభించారు

రాష్ట్ర ప్రభుత్వం త్రిపుల్ ఐటిల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది సమస్యల పట్ల స్పందించి పరిష్కారం చేయకపోవడం దర్మార్గమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రాంమోహన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఆర్‌జెయు - ఐఐఐటి ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర పిలుపుమేరకు చేపట్టిన రిలే దీక్షలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంమోహన్ మాట్లాడుతూ ఇడుపులపాయ త్రిపుల్ ఐటిలో 300 మంది దాకా బోధన, బోధనేతర సిబ్బంది గత 3 సంవత్సరాలుగా పని చేస్తున్నారని ఆయన తెలియజేశారు. వీరిలో మెంటర్స్, హెచ్‌ఆర్‌టిలు, ఇతర సిబ్బంది వివిధ రకాల పనులు నిర్వహించుచున్నారని ఆయన తెలిపారు. ఇతర సిబ్బందికి జివో నెం.3 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సిలర్‌కు, డైరెక్టర్‌గా అనేక సార్లు విజ్ఞప్తి చేసినా స్పందించి సమస్యను పరిష్కారం చేయలేదన్నారు. దీనికి నిరసనగా నవంబర్ 9 నుండి ట్రిపుల్ ఐటి సిబ్బంది సమ్మె చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఎన్. శివరాం, జిల్లా కమిటీ సభ్యులు కామనూరు శ్రీనివాసులరెడ్డి, ఐఐటి ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు మల్లికార్జున, సాగర్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment