తిరుచానూరు పద్మావతి అమ్మవారికి భక్తులు పోటెత్తారు
తిరుచానూరు పద్మావతి అమ్మవారికి మంగళవారం జరిగిన పంచమితీర్థం ఉత్సవానికి భక్తులు పోటెత్తారు. పద్మసరోవరం, పరిసరాల్లో ఎటు చూసినా భక్తులతో నిండిపోయింది. అశేష భక్తజనావళి ఆనందోత్సాహాలు, గోవిందనామస్మరణ మధ్య ఈ వేడుక జరిగింది. కార్తీక మాసం శుక్లపక్షంలో పంచమి తిథి తిధి రోజున పద్మసరోవరంలో అమ్మవారు ఉద్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రకారం.. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగడం ఆనవాయితీ. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించారు. 8 గంటలకు అమ్మవారిని, చక్రతాళ్వార్ ను బంగారు తిరుచ్చిపై తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చి మంటపంలో కొలువుదీర్చారు. తిరుమల నుంచి గజరాజులపై ఊరేగింపుగా సారె (పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పసుపు, కుంకుమ, చందనం) తీసుకొచ్చారు. వీటితో అమ్మవారి ఉత్సవమూర్తికి, చక్రతాళ్వార్‌కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం భక్తకోటి గోవింద నామస్మరణల మధ్య కుంభలగ్నంలో 12.48 గంటలకు చక్రతాళ్వార్ పంచమితీర్థం నిర్వహించారు.
No comments:
Post a Comment