చరణ్ తేజ్-ఉపాసన డిసెంబర్ 1న నిశ్చితార్థం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్-ఉపాసన కామినేని నిశ్చితార్థం డిసెంబర్ 1న జరుగనున్న విషయం తెలిసిందే. అయితే నిశ్చితార్థ వేడుక ఎక్కడ జరుగుతుందనే విషయమై ఇప్పటి వరకు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నిన్నమొన్నటి వరకు ఈ వేడుక దోమకొండ కోటలో అని ఒకసారి, గోల్కొండ రిసార్ట్స్ లో జరుగుతుందని మరొక సారి ప్రచారం జరిగింది. అయితే అది వాస్తవం కాదని తాజాగా మంగళవారం మెగాకుటుంబ సన్నిహితుల నుంచి అందిన సమాచారం.మొయినాబాద్ మండలం, చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్డులో ఉన్న ఫామ్‌హౌస్‌లో జరగనున్న ఈ నిశ్చితార్ధానికి ఇరు కుంటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు, బం«ధువులు మాత్రమే పాల్గొంటారని సమాచారం.
No comments:
Post a Comment