Friday, 14 October 2011

టీచర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు

శ్రీశైలం ఐటీడీఏ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాజె క్ట్ అధికారి కె.రమేష్ తెలిపారు. స్కూల్‌అసిస్టెంట్లు, తెలుగు పండిట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 19న నోటిఫికేషన్ ఇచ్చిన ట్లు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలి పారు. ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన ఎస్టీ అభ్యర్థిని, అభ్యర్థులు రూ. 100 ఫీజు చెల్లించి ఐటీడీఏ కార్యాలయంలో రిక్రూట్‌మెంట్ సెల్‌లో దరఖాస్తులు పొందవచ్చన్నారు.

పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల18 లోగా శ్రీశైలం ఐటీడీఏ కార్యాలయంలో అందజేయాలని కోరారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడగించబడదన్నారు. దరఖాస్తు ఫారంలో సూచించిన లోకల్ ట్రైబ్ సర్టిఫికెట్ స్థానంలో తహశీల్దార్ల ద్వారా గతంలో జారీ చేయబడిన ఏజెన్సీ ఏరియా సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోబడతాయన్నారు. లో కల్ ట్రైబ్ సర్టిఫికెట్ స్థానంలో ఏజెన్సీ ఏరి యా సర్టిఫికెట్లనుకూడా పరిగణనలోకి తీసుకునే విషయాన్ని అభ్యర్థులు గమనించాలని కోరారు. ఈనెల 18 తర్వాత వచ్చే దరఖాస్తులను అంగీకరించడం జరగదని తెలిపారు

No comments:

Post a Comment