ఆదోని వ్యవసాయ మార్కెట్‌కు 21మంది వ్యాపారులు కేటాయించిన దుకాణాల బాడుగలను చెల్లించకుండా 11 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వ్యాపారుల బకాయిలను ఆడిట్ అధికారులు ఎత్తి చూపుతుండడం వలన మార్కెట్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. బకాయి పడ్డ సొమ్మును మాఫీ చేయించుకోవడానికి వ్యాపారులు రాజకీయ నాయకుల చుట్టూ 11 సంవత్సరాల నుంచి ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే అధికారులు బకాయిలను వసూలు చేయడానికి అవసరమైతే ఆర్‌ఆర్ యాక్టు అమలు చేయడానికి పూనుకుంటున్నారు. మార్కెట్‌యార్డులో 11సంవత్సరాల క్రితం కోట్లాది రూపాయలతో పత్తి మార్కెట్‌యార్డును నిర్మించారు. మార్కెట్లో 21గోదాములను కూడ వ్యాపారులకోసం నిర్మించారు. ఈగోదాములను బహిరంగ వేలం ద్వారా 23మంది వ్యాపారులు తీసుకున్నారు. తీసుకున్నప్పటినుంచి బకాయిలు చెల్లించినమాట వాస్తవమేనని మార్కెట్‌యార్డు కమిటీ కార్యదర్శి రామమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పోటీ పడి గోదాములను తీసుకున్న వ్యాపారులు తీసుకున్న గోదాముల్లో విభాగాలు చేసి కొంతమంది వ్యాపారులకు దుకాణాలకోసం బాడుగలు ఇచ్చి బాడుగలను వ్యాపారులు జేబుల్లో వేసుకుంటున్నారు. కానీ మార్కెట్ కమిటీకి మాత్రం నెలనెల బాడుగలు చెల్లించలేదు. ఈవిధంగా 11సంవత్సరాలు గడిచిపోయింది. 2006సంవత్సరంలో బాడుగలను తగ్గించి బకాయిలను మాఫీ చేయాలని ప్రభుత్వానికి వ్యాపారులు చేసుకున్న విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది. అయినప్పటికీ కూడ వ్యాపారులు బాడుగలు చెల్లించకుండా అలాగే కాలయాపన చేస్తున్నారు. పదకొండేళ్లు కావడంతో బాడుగలు తడిసి మోపుడై ఇప్పుడు రూ.80లక్షల మేర 23మంది వ్యాపారులు మార్కెట్‌యార్డుకు బకాయి పడ్డారు. మార్కెట్ అధికారులు కూడ వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం వలన వ్యాపారులు కూడ పెద్దగా స్పందించలేదు. ప్రతి సంవత్సరం బకాయిల వ్యవహారం ఆడిట్‌లో వస్తూనే ఉంది. చాలామంది అధికారులు బకాయిల వసూళ్లకు పూనుకున్నారు. కానీ వ్యాపారులు అప్పటికప్పుడు స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీల నాయకులను కలిసి అధికారులపై ఒత్తిడి తీసుకొని రావడంతో అధికారులు కూడ కిమ్మనకుండా ఉండిపోతున్నారు. దీంతో చివరకు రూ.80లక్షల వరకు బకాయి చేరగా వ్యాపారులు ఇంత మొత్తం బకాయి పడ్డ విషయం నిజమేనని మార్కెట్ కమిటీ కార్యదర్శి స్పష్టం చేశారు. ఇటీవల సీమ స్థాయి మార్కెట్ కమిటీ జెడివద్ద బకాయిపడ్డ వ్యాపారులు కలిసి బకాయిలను మాఫీ చేయాలని కూడ కోరినట్లు సమాచారం.
No comments:
Post a Comment