వరుస కరువుతో అనంత అన్నదాతలు ప్రజలు కూలీలు, అల్లాడి పోతున్నారు. ఆ భారి
నుంచి రక్షించి, ఆదుకోవాలంటూ కేంద్ర కరువు పరిశీలన బృందాలకు జిల్లా టీడీపీ
నేతలు విజ్ఞప్తి చేశారు. నంపెట్టే రైతన్న ఆ కుటుంబ పోషణ కోసం కూలీగా మారిపోయారని ఆవేదన వ్యక్తం
చేశారు. అయినా రైతులను ఆదుకోవడంలో పాలకులు,విఫలం చెందారన్నారు. ప్రత్యేక
ప్యాకేజీ ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రతిపక్షాలు గొంతెత్తి అరుస్తున్నా
పట్టంచుకోవడం లేదన్నారు. పంటల భీమా, పంట నష్టపరిహారం సక్రమంగా ఇవ్వడం
లేదన్నారు. అరకొరగా వచ్చిన పరిహారం కూడా బ్యాంకర్లు పాత అప్పులకు
జమచేసుకుంటున్నారని వాపోయ్యారు. వర్షాబావ పరిస్థితుల వల్ల భూగర్భ జాలాలు
అడుగంటిపోయాయన్నారు. బోర్ల క్రింద పంటలు ఎండిపోవడంతో పాటు తాగడానికి
నీరులేక అవస్థలు పడుతున్నామన్నారు. పేదలను ఆదుకోవడానికి ఉపా«ధి పథకం
పెట్టినా పనులు కల్పించడంలేదన్నారు. దీంతో వలసలు వెళ్తున్నారని
తెలిపారు. జిల్లాకు రావాల్సిన వాటా నీరు కూడా రావడంలేదన్నారు. అందుకే
అనంతను ఆదుకోవాలని కోరారు. ముఖ్యంగా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా సహాయక చర్యలు
చేపట్టాలని,నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.10వేలు పరిహారం అందించాలని,
ఖరీఫ్‌లో వేరుశనగ విత్తనంతో పాటు ఇతర విత్తనాలు అందించాలని పశువుల కోసం
పశుగ్రాసం,నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని . ఉపాధి పథకంను వ్యవసాయానికి
సందానం చేయాలని టీడీపీ నేతలు కరువు బృందం ప్రతినిధులకు విన్నవించి వినతి
పత్రం అందించారు.
No comments:
Post a Comment