బీజ కణ క్యాన్సర్‌తో బాధపడుతూ
అమెరికాలో చికిత్స చేసుకుంటున్న యువరాజ్ మొదటి సారి ఓ ప్రముఖ ఛానల్‌తో
ఫోన్‌లో ఛాట్ చేస్తూ "నాకే ఎందుకు ఇంత ఇబ్బంది కోలవేరి డి?" అని అన్నారు.
అమెరికాలో ఉన్న బోస్టన్ క్యాన్సర్ హాస్పిటల్‌లో డాక్టర్లు నా ఆరోగ్యాన్ని
కంటికి రెప్పలా కాపాడుతున్నారని అన్నాడు. డాక్టర్లు ఇచ్చే మెడిషన్‌కు
బాగానే రెస్పాండ్ అవుతున్నానని అంటున్నారు. దేవుడి దయవల్ల నేను తొందరలోనే
మీ ముందుకి వస్తానని తెలిపాడు.దీనితో
పాటు తన ప్రైవసీని గౌరవిస్తున్నందుకు మీడియాకు కృతక్షతలు తెలిపాడు. తన
ట్విట్టర్ ద్వారా నా దేశం జెర్సీ, క్యాప్ ధరించి.. దేశం తరుపున మళ్లీ
ఆడేందుకు ప్రతి రోజూ ఎదురు చూస్తున్నానని యువరాజ్ ట్వీట్ చేశాడు. ఇక
యువరాజ్ టీమ్‌మేట్స్ టీమిండియా సభ్యులలో ఒకడైన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర
సెహ్వాగ్ 'యువీ అమెరికాలో కీమోథెరఫీ చికిత్స కోసం వెళ్లిన సంగతి తెలిసింది.
అతడు త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి జట్టులోకి వస్తాడని
ఆశిస్తున్నాం. యువీ సత్వరంగా కోలుకోవాలని జట్టు సభ్యులందరం
ప్రార్ధిస్తున్నాం' అని పేర్కొన్నాడు.ట్రీట్‌మెంట్ మొదట్లో, నేను కోపంతో
పాటు కొంత గందరగోళ పరిస్దితిలో ఉన్నాను. నేను నా జీవితంలో విభిన్నంగా
కొన్ని పనులు చేసి ఉన్నానని ఆలోచిస్తూ ఉండిపోయాను. నేను క్యాన్సర్‌తో బాధ
పడుతున్నట్లు తెలియగానే.. ఆ షాక్ నుండి తేరుకోవడానికి నాకు కౌన్సిలర్ చేసిన
సహాయం మరువలేదని అన్నారు. ప్రస్తుతం నేను ఓ ఫైటర్‌ని. గతంలో మాదిరి
కాకుండా నేను ఇంకా బలవంతుడి మాదిరి తిరిగి వస్తానని యువరాజ్
తెలిపాడు.టీమిండియాకు ప్రపంచ కప్‌ని సాధించి పెట్టడంలో కీలక పాత్ర పోషించిన
ఎడమ చేతి
వాటం యువరాజ్ సింగ్ ప్రస్తుతం అమెరికాలో కీమెధెరపీ చేయించుకుంటున్న విషయం
తెలిసిందే. ఈ సందర్బంలో తనకు అండగా నిలిచిన అభిమానులకు ప్రత్యేక కృతక్షతలు
తెలిపాడు. తాను కోలుకోవాలంటూ ప్రార్దనలు చేస్తున్న కారణంగా తిరిగి వస్తానని
యువరాజ్ ఆశాభావం వ్యక్తం చేసాడు

No comments:
Post a Comment