మహా శివరాత్రి పర్వదినం సందర్భం గా శ్రీకాళహస్తీశ్వరస్వామి ఆల యానికి వచ్చే
భక్తులను దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పా ట్లు చేసినట్లు దేవస్థానం ఈవో
విజయకుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ
భక్తులందరికీ శీఘ్ర ద ర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఆలయంలో ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేశామని చెప్పారు. గతంలో రెండుసార్లు శివరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన అనుభవం ఉండడంతో అందరి సహకారంతో పనులను త్వరితగతిన పూర్తి చేశామని తెలిపా రు. స్వర్ణముఖినదిలో భక్తులు స్నానాలు చేసేం దుకు ఏర్పాట్లు చేశామని, మహిళలు బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులను ని ర్మించామన్నారు. మరుగుదొడ్లను రెండుచోట్ల నిర్మించామని, శివరాత్రి రోజున మొబైల్ మ రుగుదొడ్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. ‘లక్షకు పైగా భక్తులు వచ్చినా ఇబ్బందులు లేకుండా దర్శనం చేయిస్తాం. ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటుచేస్తున్నాం. సాధారణ భక్తులు, స్పెషల్ టికెట్లు కొనుగోలు చేసినవారు, వీఐపీలు ఎవరికీ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. ఆలయంలోని క్యూలో ఉండే భక్తులకు మంచినీటిని అందిస్తాం. భక్తులు ఉక్కపోతకు గురికాకుండా అదనంగా ఫ్యాన్లు ఏర్పాటు చేశాం. అలంకరణకు బెంగళూరునుంచి పుష్పాలను తెప్పిస్తున్నాం. లక్షకు పైగా వడలను తయారు చేస్తున్నాం. పులిహోర, పొంగలి, జిలేబీ ప్రసాదాను అదేరోజు తయారు చేయిస్తాం. రథోత్సవం, కల్యాణోత్సవానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. ఆలయ పరిసరాల్లో విద్యుత్ దీపాలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశాం. ఉత్సవాల నిర్వహణకు భారీ బందోబస్తు కల్పిస్తాం. టీటీడీ సహకారంతో విద్యుత్ ఆర్చీలు, గుర్రాలు, ఏనుగులు, తదితరాలను ఉత్సవాలకు తీసుకొచ్చాం’ అని ఈవో విజయకుమార్ వివరించారు.మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం తేజోమయుడైన శివుడు సూర్యప్రభ వాహనంపై కొలువుదీరి పురవీధులలో విహరించారు. జ్ఞానప్రసూనాంబిక అమ్మవారు రథంపై వెంటరాగా సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఉదయం భక్తులకు కన్నులపండువగా సాక్షాత్కరించారు.ఆకాశంలో వెలిగే సూర్యబింబాన్ని ధిక్కరించేవిధంగా ప్రమ«థ గణాధిపతి అలరారారు. రంగురం గుల కొత్తగొడుగులు, ఛత్రచామరాలు మెరయుచుండగా స్వామివారి ఊరేగింపు భక్తజనరంజకంగా సాగింది. ఆది దంపతుల ఊరేగింపులో వేదమంత్రోచ్ఛరణలు మార్మోగగా పరిసరాలు పవిత్రమయ్యాయి. ఈ సందర్భంగా భక్తులు స్వామి, అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు
No comments:
Post a Comment