Sunday, 26 February 2012

సచిన్ టెండూల్కర్‌కు ఎస్‌సీజీ గౌరవ సభ్యత్వం

ప్రఖ్యాత భారత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. సచిన్‌కు జీవితకాల గౌరవ సభ్యత్వాన్ని సిడ్ని క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ) ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో గొప్ప క్రీడాకారుల్లో ఒకరిగా పేరున్న సచిన్‌కు గౌరవ సభ్యత్వాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు న్యూసౌత్ వేల్స్ ప్రీమియర్ బ్యారీ ఓ ఫెర్రేల్ తెలిపారు. ఈ సందర్భంగా సచిన్‌పై ఫెర్రేల్ ప్రశంసలతో ముంచెత్తారు. విదేశాల్లో సచిన్‌కు సిడ్ని క్రికెట్ గ్రౌండ్ అత్యంత ఇష్టమైన మైదానమని ఆయన అన్నారు.

No comments:

Post a Comment