ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆరోగ్య శాఖ
మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నట్లు
సమాచారం. మంత్రి పదవికి మాత్రమే కాకుండా శాసనసభా సభ్యత్వానికి రాజీనామా
చేయడానికి అనుమతించాలని కోరుతూ ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి
లేఖ రాశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో రాజీనామా చేయడానికి అనుమతించాలని
ఆయన సోనియాను కోరారు.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్ష
నిర్ణయాల వల్ల తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల, పథకాల వల్ల ప్రస్తుత
ప్రభుత్వం విశ్వసనీయతను, ప్రతిష్టను కోల్పోయిందని ఆయన ఆ లేఖలో
విమర్శించారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్
రవీంద్రా రెడ్డితో మాట్లాడినట్లు, తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని
సూచించినట్లు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత
అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు వేచి ఉండాలని ఆయన
చెప్పినట్లు తెలుస్తోంది. పది రోజుల పాటు సెలవులో ఉన్న మంత్రి
శుక్రవారం శాసనసభకు హాజరయ్యారు. ఆ తర్వాత కడప జిల్లాకు వెళ్లిపోయారు.
సోమవారం కూడా ఆయన సభకు వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు ప్రభావాన్ని కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డి విఫలమయ్యారని డిఎల్ సోనియాకు రాసిన లేఖలో విమర్సించినట్లు
తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్ష వైఖరికి, నిర్లక్ష్యానికి
సంబంధించిన పలు సంఘటనలను కూడా ఆయన లేఖలో ఉదహరించినట్లు సమాచారం.Sunday, 26 February 2012
రాజీనామాకు మంత్రి డిఎల్ రెడీ?

సంబంధించిన పలు సంఘటనలను కూడా ఆయన లేఖలో ఉదహరించినట్లు సమాచారం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment