గత మూడేళ్లుగా ఎన్టీఆర్ ..'ఎంఎల్.ఏ'అవుతాడంటూ ఊరిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఆ స్క్రిప్టుకి ఇన్నాళ్లకు మోక్షం వచ్చిందంటున్నారు. జూలై లో ఈ
చిత్రం అఫీషియల్ గా లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్
తో గబ్బర్ సింగ్ చిత్రం డైరక్ట్ చేస్తున్న హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని
డైరక్ట్ చేయనున్నారు. గతంలో ఎన్టీఆర్ తో ఆది వంటి సూపర్ హిట్ ఇచ్చిన
నల్లమలుపు బుజ్జి 'షాక్' డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్లాన్
చేయబోతున్న చిత్రం ఇది. ఎం ఎల్ ఎ టైటిల్ అర్దం మంచి (ఎం)లక్షణాలు
(ఎల్)ఎ(అబ్బాయి) అని వారి భావమట. టైటిల్ ఒకటే ఇలా రాజకీయాల్ని గుర్తు
చేస్తుందా లేక సినిమా కూడా రాజకీయాలచుట్టూ తిర్గుతుందా అనేది ఇంకా
తెలియరాలేదు. అయితే మాత్రం సినిమాలో పొలిటికల్ సెటైర్స్ మాత్రం
ఉంటాయిని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మరో విశేషముంది. పెద్ద ఎన్టీఆర్ ని
గాడ్ ఫాదర్ గా చెప్పే రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి తండ్రిగా
చేయబోతున్నారని న్యూస్.జూ ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం
తెలిసిందే. ఈచిత్రానికి ‘యాక్షన్’ అనే టైటిల్ నిర్ణయించినట్లు వార్తలు
వస్తున్నప్పటికీ...‘బాద్ షా’ అనే మరో టైటిల్ పై కూడా దర్శక నిర్మాతలు
దృష్టి పెట్టారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘బాద్ షా’ అనే
టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

No comments:
Post a Comment