యువరాజ్ కి ఆర్మ్‌స్ట్రాంగ్ సందేశం
క్యాన్సర్‌తో బాధపడుతున్న డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వ్యాధి నుంచి
త్వరగా కోలుకోవాలని సైక్లింగ్ దిగ్గజం లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ సందేశం
పంపాడు. ప్రస్తుతం కీమోథెరపీ చికిత్స కోసం యువీ అమెరికాలో ఉన్న సంగతి
తెలిసిందే. ఈ సందేశాన్ని యువరాజ్ తన ట్విట్టర్ పేజీలో ఆర్మ్‌స్ట్రాంగ్
ఫొటోతో సహా పెట్టాడు. ‘నీ కోసం మా ‘లివ్‌స్ట్రాంగ్’ టీమ్ మొత్తం ఉందనే
విషయం నీకు తెలియాలని కోరుకుంటున్నాం. విజ్ఞానం శక్తివంతమైంది, ఐకమత్యమే
మహా బలం, మన దృక్పథం అన్నింటికన్నా కీలకం అని మేం తరచూ చెబుతుంటాం..
నమ్ముతాం కూడా’ అని యువీకి ఆర్మ్‌స్ట్రాంగ్ మెసేజ్ చేశాడు. ఆర్మ్‌స్టాంగ్
కూడా గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్నాడు. తన లివ్‌స్ట్రాంగ్ ఫౌండేషన్
ఇలాంటి బాధితులకు సహాయకారిగా ఉంటోంది. మరోవైపు లాన్స్ సందేశంపై యువీ
కృతజ్ఞతలు తెలిపాడు. ‘లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్‌నుంచి వచ్చిన సందేశం నాకు
ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. థ్యాంక్యూ లాన్స్.. త్వరలోనే మనం కలుసుకోవాలని
కోరుకుంటున్నా’ అని యువీ ట్వీట్ చేశాడు.
No comments:
Post a Comment