సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ హుటాహుటిన బ్రిటన్ వెళ్లాడు. ఊపిరి
తిత్తుల్లో ఏర్పడ్డ గడ్డ పెద్దదౌతుండడంతో చికిత్స కోసం లండన్‌లోని
క్యాన్సర్ నిపుణులను కలవడానికి వెళ్లాడు. ఐతే భారత అభిమానులు మాత్రం యూవీ
ఊపిరితిత్తుల్లో ఏర్పడ్డ ట్యూమర్ క్యాన్సర్ కణతి కాకూడదని
ప్రార్థిస్తున్నారు. యువరాజ్ సింగ్ ఇంగ్లండ్ వెళ్లాడని అతడి
సన్నిహితుడొకరు తెలిపారు. ఐతే యూవీకి ఈ అనారోగ్యం వరల్డ్ కప్ నుంచే ఉందని
గతంలోనే అతని తల్లి షబ్నమ్ సింగ్ తలిపారు. అతడి ఊపిరిత్తిత్తులో
గోల్ఫ్ బాల్ సైజున్న కణతి ఉందని గత అక్టోబర్‌లో జరిగిన చికిత్సలో
తెలిసింది.కాని అది క్యాన్సర్ కణతి కాదని డాక్టర్లు తేల్చారు. ఆసీస్
టూర్‌కుముందు తాను ఫిట్‌గా ఉన్నానని, ఆస్ట్రేలియా తో వన్డేలు టీ20ల్లో
పాల్గొంటానని కూడా బీసీసీఐ హింట్ ఇచ్చాడు. కాని ఇప్పుడు యూవీ హుటాహుటిన
ఇంగ్లండ్ వెళ్లడంతో అతని అభిమానులు మళ్లీ కంగారుకు గురౌతున్నారు. ఇదిలా
ఉంటే యువరాజ్‌కు పెద్ద ప్రమాదమేమీ లేదని అతడికి అందాల్సిన రిపోర్టుల్లో మరొ
రిఆపోర్టు రావాల్సి ఉందని అందుకే లండన్ వెళ్లాడని సన్నిహిత వర్గాలు
అంటున్నాయి. లండన్‌లో మెడికల్ రిపోర్టులు వచ్చిన తర్వాత యూవీ
అటునుంచి నేరుగా యూఎస్ వెళ్లనున్నాడు. మరింత మెరుగైన చికిత్సకోసమే యూఎస్
వెళ్తున్నాడని యూవీ బంధువు మీడియాకు వెళ్లడించారు. ఊపిరితిత్తుల్లో ఉన్న
కణతిని యూఎస్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేసి తీసేస్తారని అన్నారు.
ఒక్కసారి రిపోర్టులు చేతికి అందాక చికిత్స మొదలు పెడతారని అన్నారు. యూవీ
తిరిగి కోలుకోడానికి ఆరునెలలు పడుతుండడంతో అప్పటివరకు క్రికెట్‌కు
దూరమవనున్నాడు.

No comments:
Post a Comment